బాబు దృష్టి ఆలయాలపై పడింది

30 Jun 2016


అభివృద్ధి పేరుతో దేవాలయాలను కూల్చడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. బుధవారంనాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయవాడలోని గోశాల, కృష్ణుడి ఆలయాన్ని కూల్చడం దారుణమన్నారు. చంద్ర బాబు ఆలయాలనే కాకుండా మసీదులు, చర్చిలను కూడా కూల్చుతున్నారని పార్థసారధి మండిపడ్డారు. సీఎం దృష్టి అంతా ఆలయాలపై పడిందని అన్నారు. రాజధాని ప్రాంతంలో దేవుడికి కూడా స్థానం లేదా అని ఆయన ప్రశ్నించారు. సదావర్తి భూమలులను కూడా టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని ధ్వజమె త్తారు. బాబు చర్యలపై బీజేపీతో పాటు ముస్లింలు, క్రిస్టియన్ల మత పెద్దలు స్పందించాలన్నారు. భక్తుల మనోభావాలను కించపరిచే చర్యలను అందరు ప్రతిఘటించాలని పార్ధసారధి పిలుపునిచ్చారు.

YSRCP leader Kolusu Pardha Saradhi fired on Chandrababu Naidu. In the name of development Chandrababu removing temples.