గే క్లబ్ లో కాల్పుల వెనుక ఎవరున్నారు

14 Jun 2016


ఓర్లాండో గే  క్లబ్‌లో కాల్పుల ఘటన ఒమర్‌ మటీన్‌ ఒక్కడి పనే కాదా? ఇంకెవరైనా ఉన్నారా. అక్కడ జరిగిన ఘటన చూస్తే ఇంకెవరైనా సాయం చేయడం కానీ, స్వయంగా పాల్గొనడం కానీ ఉందంటున్నారు. ఐతే ప్రసిడెంట్ ఒబామా మాత్రం ఇది భారీ కుట్రగా మాత్రం అనుమానించడం లేదు. ఒర్లాండో నైట్ క్లబ్ ప్రదేశాన్ని అమెరికా ప్రసిడెంట్ ఒబామా సందర్శించారు. అంతకుముందు ఒబామా దీన్ని ఓ భారీ కుట్ర, ప్లాన్ ప్రకారం చేసింది కాదని, కొట్టి పారేశారు. కానీ వాస్తవంలో మాత్రం జరిగింది వేరంటున్నారు. ఐసిస్ కూడా ఇది తమ పనే అని చెప్తోంది. ఈ వాదనల సంగతి పక్కనబెడితే, సంఘటన జరిగిన తీరు చూస్తే ఇదేదో ఒక్కరు చేసిన పని కాదనే అంటున్నారు. ఓరైఫిల్ పట్టుకని వరసగా, మనుషులను చంపుతూ పోవాలంటే అది సాధ్యం కాదని, చనిపోయిన వారితో పాటు, గాయపడిన వారి సంఖ్య చూస్తే ఖచ్చితంగా వేరొకరు సాయం చేయాల్సిందేనంటున్నారు.

ఒక్కడూ అంతమందిపై ఫైర్ చేయడం వేరు, బందీలుగా అదుపు చేయడం చూస్తుంటే ఇది భారీ ఎత్తున ప్లాన్ చేస్తేనే సాధ్యమవుతుందంటారు. పైగా షూటర్ కాల్పులు జరుపుతున్న సమయంలో వేరెవరినో పిలుస్తున్నట్లు స్పష్టంగా ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. ఒమర్ మతీన్ అనే సదరు దుండగుడు ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదిగా ఒబామా కూడా ఒప్పుకున్నారు. ఎఫ్ బిఐ డైరక్టర్లు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. మరి ఒమర్ కి ఇంత భారీగా ఆయుధాలు సమకూర్చినది ఎవరు..? మధ్యలో కొందరు బాధితులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ల ద్వారా మెసేజ్ లు పంపించిన దానిని బట్టి కూడా ఏదో గ్రూపు అక్కడ కాల్పులు చేస్తున్న అంశాన్నే నిర్ధారిస్తుంది..

మరోవైపు ఒమర్ మతీన్ తండ్రి మాత్రం అతనిలో ఎలాంటి మార్పు గమనించలేదని చెప్పడం చూస్తుంటే, కాస్తో కూస్తో ట్రైనింగ్ లేకుండా అలా భావాలు కన్పించకుండా మెయిన్ టైన్ చేయడం కుదరదు. ఐతే ఒమర్ మతీన్ చేసిన ఘాతుకం రెండు అంశాలని ఎత్తి చూపుతోంది. ఐసిస్ ఎంత విస్తరించిందీ ఒకటైతే, అమెరికా సమాజంలో గన్ కల్చర్ కానీ ఎంత సులువుగా దాడులు జరపవచ్చో, ఓర్లాండో నైట్ క్లబ్ ఉదంతం రుజువు చేసింది..

Orlando gay clubs shooting issue was very hot topic in world wide. Obama also involved in this issue. But this is not pre planned attack, Omar is main accused in this issue.