ఇక 23 రోజులే మిగిలి ఉంది..

4 Jun 2016


 ఓ వైపు గడువు ముంచుకొస్తోంది. మరోవైపు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పను లున్నాయి. ఎన్నో పనులకు టెండర్ల ప్రక్రియే పూర్తేకా లేదు. అంతర్గత రహదారులు, మౌలిక వసతుల కల్ప న అభూత కల్పనగానే మిగిలింది. వెరసి.. వెల గపూ డి నుంచి సాగే ప్రభుత్వ పాలనపై నీలినీడలు కమ్ము కున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం మరో 20 రోజుల్లో వెలగపూడి నుంచి రాష్ట్ర పాలన యంత్రాంగం మొత్తం పనిచేయాల్సి ఉంది. తాత్కాలి క సచివాలయంలో మొత్తం అన్ని శాఖల అధి పతు లు, సిఎస్‌, ముఖ్యమంత్రి, మంత్రులు విధులు నిర్వ హించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయి తే మౌలిక సదుపాయాలపై అధికార యంత్రాంగం ఇంకా దృష్టి సారించలేదు. సచివాలయం ప్రాంగణం లో ఇప్పటి వరకూ అంతర్గత రహదారుల నిర్మాణం, కాంపౌండ్‌ వాల్‌, విద్యుద్దీకరణ, కార్యాలయంలో అవ సరమైన సౌకర్యాలకు సంబంధించి టెండర్ల ప్రక్రి యే పూర్తి కాలేదు. ఆయా పనులకు ఇంకా టెండర్లు కూ డా ఖరారు కాలేదు. దీంతో ఈ పనులు ఎప్పుడు చేప డతారు? ఎప్పటికి పూర్తవుతాయి? అనేది చర్చనీయాంశమైంది. 

ఇంకా ఎక్కడి పనులక్కడే..
ప్రస్తుతం ఆరు బ్లాక్‌లకు గాను ఐదు బ్లాకులకు రెండు శ్లాబ్‌లేశారు. కింది అంతస్తులో బ్లాక్‌ల వారీగా గదుల నిర్మిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వెలగపూడిలో 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తారని తెలుస్తోంది. కమిషనరేట్లు, డైరెక్టరేట్‌లన్నీ విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నందున వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శాఖాధిపతుల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు నిత్యం 13 జిల్లాల నుంచి వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలు ఐదారు వేల మంది వరకూ ఉంటారని అంచనా. వీరందరికీ మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, సాధారణ అవసరాలకు ఉపయోగించుకునేలా నీటి వసతి కల్పించేందుకు ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం చేయలేదు. వాహనాల పార్కింగ్‌, ద్విచక్ర వాహనాల షెడ్లు, భద్రతా సిబ్బందికి కావాల్సిన సదుపాయాలు, ప్రత్యేక గదులు నిర్మాణం ఇంకా చేపట్టలేదు. వీటితో పాటు వెలగపూడిలో బస్టాండ్‌, హాస్పిటల్‌, క్యాంటిన్‌ వంటి తదితర సదుపాయాలేర్పడలేదు. మరోవైపు వెలగపూడికి ఎటు నుంచి నీటి వసతి ఏర్పరుస్తారన్న అంశంపైనా స్పష్టత రాలేదు. సచివాలయం ప్రాంగణంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణంపై నిర్మాణ సంస్థలు దృష్టి పెట్టనందున నీటి సమస్య కూడా పొంచి ఉంది. 

రెండేళ్ల కిందట అభివృద్ధే..!
రాజధాని స్థాయిలో ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సిఆర్‌డిఎ అధికారులు పూర్తి దృష్టి సారించలేదు. గ్రామాల్లో ప్రాథమిక సౌకర్యాలేర్పడలేదు. రెండేళ్ల కిందట ఎలా ఉన్నాయో ఇప్పటికీ గ్రామాల పరిస్థితి అలాగే ఉంది. విజయవాడ-తుళ్లూరు రోడ్డును, మంగళగిరి- కృష్ణాయపాలెం రోడ్లను కొంత అభివృద్ధి చేశారు. తాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ, వీధి దీపాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేని గ్రామాలు రాజధానిలో ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరిలోనే ఉద్యోగులు ఉంటారనే భావనతో ఉన్న అధికారులు వారికి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు.

AP CM Chandrababu Naidu is saying from July 1 onward all business are must run from Amaravathi. But temporary secretariat works is not completed.