నేటికీ నేల చదువులే..

10 Jun 2016


మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వ బడులు పున:ప్రారంభం కాబోతున్నాయి. కానీ గత విద్యా సంవత్సరంలో వేధించిన సమస్యలే పునరావృతం కాబోతున్నాయి. ఇప్పటికీ మూడో వంతు పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు నేల మీదే కూర్చొని చదివే పరిస్థితి. ఇక పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులు, వంట గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలు నత్త నడకకన్నా దారుణంగా సాగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులున్న చోటుకు వెళ్లి విద్యార్ధినులు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన వంట గదుల నిర్మాణాలు కూడా మూడో వంతు మొదలే కాలేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడం, ఎక్కడైనా నిధులను కూడా వెనక్కి తీసుకోవడం వంటి సమస్యలతో అవి పూర్తి కావడం లేదు. ఈ ఏడాది స్కూళ్లు తెరిచేనాటికి పెండింగు నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి ఊసే మరిచింది. 

Again academic year started, but no growth in government school. Till now a days also schools are with out buildings. Government is not thinking about it.