టిడిపిలో చేరి తప్పు చేశానంటున్న ఎన్.ఆర్.ఐ

19 Jun 2016


వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో నుంచి టిడిపిలోకి కొందరు ఎమ్మెల్యేలు మారిన తరుణంలో ఒక ఎన్ ఆర్ .ఐ ప్రముఖుడు టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టిడిపిలోకి చేరగా , అదే నియోజకవర్గానికి చెందిన ఎన్.ఆర్.ఐ ప్రముఖుడు ఐవి రెడ్డి ఒక ప్రకటన చేస్తూ టిడిపిలో గతంలో చేరి తప్పు చేశానని ప్రకటించారు. విభజన తర్వాత ఏర్పడిన ఎపిని చంద్రబాబు బాగు చేస్తారని నమ్మి ఆ పార్టీలో చేరితో తన ఆశలు వమ్ము అయ్యాయని ఆయన అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరడం ఏదని, రుణమాఫీ జరగలేదని, ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారని ఐవిరెడ్డి అన్నారు.వీటన్నిటికి నిరసనగా టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Some of the YSRCP MLAs joining into TDP. Chandrababu Naidu attracting them with offers. But a NRI feeing unhappy with TDP. TDP government is not doing its elections promises.