చోటా రాజన్ మర్డర్ ప్లాన్

11 Jun 2016


గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ ను మర్డర్ చేసేందుకు వేసిన ప్లాన్ ను ఢిల్లీ పోలీసులు విఫలం చేశారు. దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు చోటా షకీల్ గతంలో పలు మార్లు జైల్లోనే చోటాని చంపేస్తామంటూ ఓపెన్ గానే బెదిరింపులు చేయగా, ఆ ప్రయత్నాలు జరుగుతున్నది నిజమే అని ఇప్పుడు తేలినట్లైంది. తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రాజన్ ను చంపేందుకు రంగంలోకి దింపిన నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, జునైద్, యూనిస్, మనీశ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛోటా రాజన్ ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని వీరు స్కెచ్ వేసినట్లు తెలిసింది.

ఛోటా షకీల్ తో పట్టుబడ్డ నలుగురు నిందితులు ఫోన్ లో టచ్ లో ఉన్నట్లు పోలీసులు కనుక్కున్నారు. ఈ ఫోన్ డేటా ఆధారంగానే ఈ స్కెచ్ కనుక్కున్నారు. ఐతే ఈ నలుగురు నిందితులను జూన్ 3 వ తేదీన వీరిని అరెస్ట్ చేయగా ఇన్ని రోజుల తర్వాత బైటపెట్టడమే అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే చోటా రాజన్ ని అరెస్ట్ చేయలేదని, అతనే లొంగిపోయాడని కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. అతని ప్రాణాలకు ఉన్న ముప్పును తొలగించేందుకే సెక్యూరిటీ పెంచారని అంటారు. ఇలా ఏదోటి హడావుడి చేస్తే, చోటా రాజన్ కి సెక్యూరిటీ పెంచినా ఎవరూ అభ్యంతరపెట్టరని అందుకే  ఇలా డూప్ అరెస్ట్ లు జరుగుతాయంటారు.

Murder plan on Gang star Chota Rajan was found by Chota Rajan. Daavud Ibrahim planed to murder Chota Rajan, and sent four men to jail.