చంద్రబాబు తీరు పై కన్నీరు పెట్టుకున్న ముద్రగడ…!!

22 Jun 2016


14 రోజుల పాటు చేసిన నిరవధిక నిరాహార దీక్షను ఆయన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగ్రామంలో విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎంతోమందికి అన్నదానం చేసిన తన కుటుంబానికి తీరని అవమానం జరిగిందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్ష ప్రారంభించిన మొదటి రోజే.. మూడు గంటలలోపే పోలీసులు తలుపులు పగలగొట్టుకుని లోపలకు వచ్చారని, తనను మర్యాదగానే తీసుకెళ్లినా, తన భార్యను రెండు రెక్కలు పట్టుకుని బూతులు తిడుతూ తీసుకెళ్లి.. ఎత్తి బస్సులో పారేశారని కన్నీటిపర్యంతమయ్యారు. తన కోడలిని, బావమరిది భార్యను, తన కొడుకును కూడా బండబూతులు తిడుతూ.. కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఆయన చెప్పారు.

కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కాపు నేతలు ఆగ్రహోదగ్రులయ్యారు. తుని విధ్వంసకారుల పేరిట అరెస్ట్ చేసిన కాపుల విడుదల, కేసుల ఎత్తివేతను డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష కొనసాగించిన ముద్రగడ… అరెస్టైన కాపులకు బెయిల్ రావడంతో దీక్ష విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొద్దిసేపటి క్రితం తన సతీమణితో కలిసి రాజమహేంద్రవరం నుంచి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహం చేరుకున్నారు. అనంతరం ఆయన నిమ్మరసం తాగి దీక్షను విరమించారు.

ఈ సందర్భంగా ముద్రగడను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో కాపు నేతలు కిర్లంపూడి వచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సామాజిక వర్గ డిమాండ్లను సాధించుకునేందుకు శాంతియుతంగా దీక్షకు దిగిన ముద్రగడను పోలీసులు ఖైదీ కంటే హీనంగా చూశారని వారు వ్యాఖ్యానించారు.

Mudragada is doing fasting fight for Kapu reservation, and to join into BC. Today he was leaved fasting fight and gave press meet. In this press meet he was teared.