మేకింగ్ ఆన్ మన్మోహన్ సింగ్

14 Jun 2016


మాజీ ప్రధానమంత్రులపై సినిమాలు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ, అందులో రాజకీయాలు కాకుండా కేవలం మేధావి వర్గానికే పరిమితమై, పెద్దగా జనాకర్షణ లేని వారైతే బాలీవుడ్ వారిని పెద్దగా పట్టించుకోదు. కానీ మన్మోహన్ సింగ్ మాత్రం ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవాలి. సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా మరో ఆర్నెల్లలో బయటకు రానుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఓ సినిమా చిత్రీకరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 కుపైగా భాషల్లో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. 2017 చివర్లో థియేటర్లలో ప్రదర్శితమవుతుందని భావిస్తున్నారు. ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌: ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌’ పేరిట సంజయ్‌బారు రాసిన వివాదాస్పద పుస్తకం ఆధారంగా చిత్రీకరణ జరగనుందని చిత్రయూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా ఓ షెడ్యూల్ పూర్తి కాగానే ఆగస్టు 30న టీజర్‌ విడుదల విడుదల అవుతుందట. ఇదే మూవీలో సోనియా, రాహుల్ పాత్రలు కూడా ఉన్నాయ్. ఐతే వీటి పాత్ర ధారులెవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. పంజాబ్‌కు చెందిన ఓ యువ నటుడు రాహుల్‌గాంధీ పాత్ర పోషించనున్నాడని టాక్. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటేనే ఎంతో హంగామా, బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అదే ప్రధాని పదవంటే ఇంకా చాలా తతంగం, రాజకీయ పరమపదసోపాన పటంలో అనేక మెట్లు ఉంటాయ్. ఐతే రేపు పదవి ఎక్కేముందు కనీసం ఆ ఊసే ఐడియా లేకుండా ప్రైమ్ మినిస్టర్ అవడం మన్మోహన్ సింగ్ లైఫ్ లో పెద్ద మెలోడ్రామా అని సినిమాలో చెప్తారట.

Making movies on Ex Prime Ministers are very rare in India. Now a movie is making on Ex-Prime Minister Manmohan Singh on the basis of Sanjay Bharu book "The accidental Prime Minister: The Making And Unmaking Of Manmohan Singh.