పెళ్లైనా విద్యాబాలన్ కి ఓకేనట

11 Jun 2016


హిందీ నటి విద్యాబాలన్ ప్రస్తుతం టెత్రీన్ (Te3n) హడావుడిలో ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన విద్యాబాలన్ పెళ్లైనా సినిమాల్లో చేయడం పెద్ద కష్టం కాదని, అదంతా మనం తీసుకునే విధానంలోనే ఉంటుందని  సెలవిస్తోంది. బిగ్ బి తో ఈ సినిమా స్క్రీన్ షేర్ చేసుకున్న విద్యా బాలన్ డర్టీ పిక్చర్ తోనే దేశమంతా గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత కహానీ చేసినా కూడా డర్టీ ఇమేజ్ ముందు పనికిరాలేదు. ఐతే సినిమాల విషయంలో చూస్తే, ఏ మూవీ అంతకుముందు మూవీతో పోల్చలేం మధ్యలో పెళ్లైనంత మాత్రాన అదే ఆలోచిస్తూ కూర్చుంటే కెరీర్ ఎండ్ అవడం ఖాయమని తేల్చేసింది. 

ఆలుమగలు ఆర్ధం చేసుకుని ముందుకెళ్తే, సినిమా కెరీర్ లో ఇబ్బందులు ఉండవని, మధ్యలో సమస్యలు వచ్చినా సొల్యూషన్ ఉంటుందని చెప్తోంది విద్యాబాలన్. రీసెంట్ గా  Te3n తో పాటు కహానీ- 2, బేగమ్ జాన్, ఏక్ అల్ బేలా నాలుగు సినిమాలతో బిజి బిజీగా గడుపుతోంది విద్యాబాలన్. తనకి వచ్చిన ఆలోచనలతో డైరక్షన్ కూడా చేయాలని ఉందట విద్యాబాలన్ కి. అందుకే ఓ గ్రూప్ ఆఫ్ రైటర్స్ ని పెట్టుకుని వారికి తన ఐడియాలు ఇస్తుందట.

Bollywood heroin Vidya Balan is familiar to all over India with Dirty Picture. Now she is doing Te3n. She telling marriage is not a problem for acting.