సోనియాగాంధీకి మరో లీగల్ నోటీస్

8 Jun 2016


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై కేరళలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేరళలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ భవనం నిర్మించిన కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తనకు చెల్లించాల్సిన డబ్బు ఇంకా చెల్లించలేదని సోనియా సహా మరికొందరు కాంగ్రెస్ నేతలపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ చైర్మన్ రమేశ్ చెన్నితల, కేరళ మాజీ సిఎం వూమెన్‌చాందీ, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీఎం సుధీరన్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

కేరళ కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటలు అధినేత్రి సోనియాగాంధీకి చిక్కులు తెచ్చిపెట్టాయ్. ఏకంగా  లీగల్ నోటీసులు పంపే స్థాయికి సిచ్యుయేషన్ చేరడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేరళలో రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ స్టడీస్ పేరుతో ఓ భవంతి నిర్మితమైంది, దీన్ని హీథర్ కన్ స్ట్రక్షన్స్ అనే నిర్మాణసంస్థ చేపట్టింది. ఐతే దాని తాలుకూ బిల్స్ ఇవ్వకపోవడంతో కోర్టుకెళ్లాలని నిర్ణయించుకుంది, ఇందుకోసం లీగల్ నోటీసు కూడా పంపింది. ఈ నోటీసులను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేరళ పీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్, ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాలకు పంపింది హీథర్ కన్ స్ట్రక్షన్స్.

అసలు హీథర్ కన్ స్ట్రక్షన్స్ కి సంబంధించి కేరళ కాంగ్రెస్ బకాయి ఉన్నది 2కోట్ల 80లక్షలు. ఆ మాత్రం డబ్బు కూడా  సర్దుబాటు కాకుండా ఉండటానికి కారణం, ఆ పార్టీ నేతల్లోని కుమ్ములాటలే అంటున్నారు. ప్రతిసారీ ఏదోక సాకు చెప్పి డబ్బు ఇవ్వక పోవడంతోనే హీథర్ సంస్థ ఈ నిర్ణయానికి వచ్చిందట. కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే, ప్రభుత్వం మారిన కొన్ని రోజుల్లోనే ఈ కేసు నమోదవడం రాజకీయకక్షల్లో భాగంగానే స్థానిక కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.

A case was file against UPA chief Sonia Gandi in Kerala. In Kerala UPA constructed Rajiv Gandhi institute of Development, this construction contractor filed case, because they are not paying money.