చంద్రబాబు పై మండిపడిన కొమ్మినేని…

29 Jun 2016


చంద్రబాబు బుల్లి తెరవెనుక రాజకీయంతో ఎన్టీవీలో ఉద్యోగం పోగొట్టుకున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మరోసారి ఆయన వైఖరిపై మండిపడ్డారు. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతతో చంద్రబాబు కులాల రాజకీయానికి తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న సాక్షి మీడియా తరపున ప్రసారాల నిలిపివేతపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

కాపుల ఉద్యమ వార్తలను తొక్కి పెట్టడానికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయడం ద్వారా కులాల కురుక్షేత్రం చేసేలా ఉన్నారని కొమ్మినేని విమర్సించారు. చంద్రబాబు చాలా ప్రమాదకరమైన దోరణితో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒక సామాజికవర్గ ఉద్యమ వార్తలను అణచి వేయడానికి చంద్రబాబు చెస్తున్న ప్రయత్నం సమాజంలో చీలిక తెస్తుందని హెచ్చరించారు.

చంద్రబాబు చర్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక వర్గాల మధ్య విద్వేషాలకు, అంతరాలకు, దారి తీస్తుందని కొమ్మినేని హెచ్చరించారు. చంద్రబాబు తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారా? తెలివిగా చేస్తున్నారా?తెలివి తక్కువగా చేస్తున్నారా అన్నది తెలియదంటూ ఘాటుగా కామెంట్ చేశారు కొమ్మినేని. ఎవరు సలహా ఇస్తున్నారో కాని ఆయన చేస్తున్నది మాత్రం పద్దతి కాదన్నారు.1

చంద్రబాబు గతంలో ఇలా ఉండేవారు కాదని, ఇప్పుడు ఏమైందో కాని ఆయన వ్యవహార శైలి ఘోరంగా ఉందని సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని కామెంట్ చేశారు. ఒక టివీ ప్రసారాన్ని ఆపు చేస్తే అంతా అయిపోతుందనుకోవడం కేవలం చంద్రబాబు భ్రమ అంటున్నారు కొమ్మినేని. ఒకటి మాత్రం వాస్తవం.. అది చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా ఇలా మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం.

TV Journalist Kommineni was fired on Chandrababu Naidu for stoping Sakshi program telecasting. He said really it is the power miss using of Chandrababu Naidu.