పిల్ల కత్తి గురూ

5 Jun 2016కత్తిలాంటి అందమున్న కత్రీనా కైఫ్ వోగ్ మేగజైన్ పై మెరిసిపోయింది. లవర్ తో బ్రేకప్ అయినా తన కెరీర్ పై ఆ ఎఫెక్ట్ పడలేదని ఈ ఫోటో షూట్ తో ప్రూవ్ చేసింది. లెదర్, టూపీస్, లాంగ్ పీస్ ఇలా రకరకాల కాస్ట్యూమ్స్ లో తన అందాన్ని ప్యాక్ చేసిందీ బ్యూటీ.

 కత్రీనా కైఫ్ రీసెంట్ టైమ్స్ లో హిట్ సినిమాల్లో యాక్ట్ చేయలేదు. ఐతే కెరీర్ బిగినింగ్ నుంచీ అటు సినిమాలు. ఇటు మోడలింగ్ వదల్లేదామె. ఫేమస్ మేగజైన్ కవర్  పేజీలపై ప్రతి ఏటా దర్శనమిస్తూనే ఉంటుంది. ఇప్పుడలానే వోగ్ మేగజైన్ జూన్ ఎడిషన్ కి ఆమె చేసిన వీడియో షూట్ కేకపెట్టిస్తోంది.

బీచ్ ఒడ్డున. తర్వాత సముద్రంలోనూ.. స్విమ్ చేస్తూ. రకరకాల భంగిమల్లో  వోగ్ మేగజైన్‌కి హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది కత్రినా. ఫోటోషూట్‌లో సన్నజాజిలాంటి నడుముతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోందీ భామ. ఆమెకి బీచ్ లో కూల్ గా ఉందో లేదో తెలీదు కానీ. ఫోటో షూట్ మాత్రం అందరిలో హీట్ పెంచుతోంది. 

లెదర్ కేజ్ బికినీలో ఈ అమ్మడు అందాలు అదిరిపోయాయని నెటిజన్ల కామెంట్. కైపెక్కించే కళ్లు,మెరిసిపోయే స్కిన్, ఇక చూసేవాళ్లదే లోటన్నట్లుగా సాగింది కత్తిలాంటి అమ్మడి ఫోటో షూట్.

Bollywood hot heroin Katrina Kaif is now not doing movie in Bollywood. She is away from silver screen since long time. Recently she appeared in Photoshoots for vogue magazine.