తమిళంపై సంస్కృతం రుద్దుతున్నారా..

14 Jun 2016


ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత, పరాజయ భారం నుంచి డిఎంకే వేగంగా కోలుకోవడమే కాకుండా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నే చేస్తోంది. తమిళ భాష అణగదొక్కుతున్నారని, కేంద్రంపై పోరాటానికి సిధ్దం కావాలంటూ కరుణానిధి పిలుపు ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఐతే ఎన్డీఏకి జయలలిత దగ్గరవుతుండటంతో, విధిలేకే ఇలా కేంద్రంపై పోరాటమనే వ్యూహం ముందుకు తెస్తున్నారని మరో వాదన ఉంది. 93 ఏళ్ల వయస్సులో డిఎంకే అధ్యక్షుడు కరుణానిధి పరాజయ భారం నుంచి చాలా వేగంగా కోలుకుంటున్నారు. జయలలిత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీనికి తమిళ సెంటిమెంట్ ను బేస్ చేసుకుని ముందుకెళ్లే ప్లాన్ వేశారు. 

రాష్ట్రంలో తమిళ భాషను నిర్లక్ష్యం చేసి, సంస్కృతం రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మామూలుగానే అరవనాట తమిళ సెంటిమెంట్ ఎక్కువంటారు, అందుకే ఏ భాష వారైనా అక్కడ ప్రథమ భాషగా తమిళాన్నే ఎంచుకోవాలని ప్రభుత్వం నిర్బంధిస్తోంది. ఇందుకోసం తెలుగుకి చెందినవిద్యార్ధులు కూడా తమిళంలోనే పరీక్షలు రాయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదలా ఉంచితే, ఇప్పుడు కేంద్రం తమిళంపై సంస్కృతాన్ని రుద్దుతున్నారంటూ కరుణానిధి సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. దీని వెనకూ జయలలిత వ్యూహానికి ప్రతివ్యూహమే ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జయలలిత ఎన్డీఏకి దగ్గర అవుతున్నారని ఓ ప్రచారం సాగుతోంది. అందుకే అటు కేంద్రాన్ని, ఇటు జయలలితను దెబ్బకొట్టాలంటే ఈ తమిళ సెంటి మెంట్ ఒక్కటే పెద్ద అస్త్రంగా భావిస్తున్నారు కరుణానిధి.. 
డిఎంకే ఎమ్మెల్యే పూంగోదై కూతురు పెళ్లికి హాజరైన కరుణానిధి..హిందీ సంస్కృతాన్ని రుద్దుతున్నారని ఆరోపించారు..అసలు పాఠ్యపుస్తకాల్లో కూడా సంస్కతాన్ని చేర్చకూడదని ఆయన పిలుపు ఇవ్వడం గమనార్హం..అసలు ద్రవిడ భాషలన్నీ..సంస్కృతం నుంచే పుట్టాయంటారు..అలాంటిది ఈ విషయం తెలిసి కూడా సెంటిమెంట్ ని రెచ్చగొట్టాలని అనుకోవడం తమిళ రాజకీయాలకే చెల్లుతుంది..ఐతే ఎవరి భాష మనుగడ వారు కోరుకుంటారు..తమిళనాట పేర్లు కూడా తమిళంలోనే ఉంటాయ్..వారి ప్రాంతీయాభిమానం ఇలానే ఉంటుంది కానీ.. మరో భాషపై ద్వేషం పెంచడమే విమర్శలపాలవుతోంది..

Karunanidhi recovered form big disaster of 2016 elections. Now he doing politics with NDA and Jayalalitha. He is fighting for Central government trying to merge Sanskrit on Tamil.