కరీనా కపూర్ కన్ఫామ్ చేసింది

11 Jun 2016


కరీనాకపూర్ తాను ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ రావడంపై గుస్సా అయింది, అలాంటిదేం లేదని ఓ వేళ అలా ఉంటే దాన్ని దాచలేం కదా అని ఫైరయ్యింది. ఎందుకు అనవసర విషయాలు, వ్యక్తిగత విషయాలపై వార్తలు రాసుకుని సంతోషపడతారని విలేఖర్లుకు ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే 40 ఏళ్లకి దగ్గర పడ్డ ఈ వైట్ బ్యూటీ తల్లి కావడమనేది ఓ వరమని చెప్తోంది. కపూర్ ఖాన్ దాన్ నుంచి లాంగెస్ట్ కెరీర్ ఎంజాయ్ చేస్తున్న కరీనాకపూర్ ఖాన్, ఇప్పుడప్పుడే తల్లి కావాలనే ఆలోచన లేదని చెప్పడమే విడ్డూరంగా అన్పించకమానదు. 

ఎందుకంటే మాతృత్వానికి వయస్సు ఓ పరిమితిగా నిలిచే అవకాశం ఉంది. అందుకే ఐశ్వర్యారాయ్ లాంటి హీరోయిన్లంతా చక్కగా పెళ్లవగానే పిల్లలను కని, తర్వాత నటన కొనసాగిస్తున్నారు తప్ప, అందం ఉన్నప్పుడే సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఐతే ఇది కరీనా చెప్పినట్లు వ్యక్తిగత విషయం కాబట్టి, దానిపై చర్చలు అనవసరం. తాను లండన్ లో జాయ్ టూర్ కి వెళ్తే, అది గర్భవతి అని చెప్పడంతో ఇలా వివరణ ఇచ్చింది కరీనా కపూర్. హజ్బెండ్ సైఫ్ తో కలిసి హాలిడే ట్రిప్ కి మాత్రమే వెళ్లానని, ఆమె ఇచ్చిన  ఎక్ల్ ప్లనేషన్ తో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడిపోయింది.

Bollywood white beauty Kareena Kapoor gave clarity about gossips on her. Recently she went to Foreign trip, so rumor is she is pregnant. She gave clarity about it.