లాలూ ప్రసాద్ యాదవ్ ని సేఫ్ చేయబోతున్నారా

8 Jun 2016


బీహార్‌లో సంచలనం రేపిన 1990 నాటి గడ్డి కుంభకోణానికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్లు కనిపించకుండా పోయాయి. పశు, మత్స్య వనరుల శాఖ ఈమేరకు సచివాలయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు వెయ్యి కోట్ల గడ్డి స్కాంకు సంబంధించి నాటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు కూడా వెళ్ళారు. ప్రస్తుతం జేడీయూ ప్రభుత్వంలో ఆర్జేడీ భాగస్వామ్యం కావడంతో లాలూను కాపాడేందుకు సీఎం నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ విమర్శించింది. అందుకే కీలక ఫైళ్ళను మాయం చేసిందని ఆ పార్టీ ఆరోపించింది.

లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ పాలిటిక్స్ పై మనం గతంలో ఓ కథనం ఇచ్చాం. ఇప్పుడు వారితో పాటే తానూ ఎలాగైనా చక్రం తిప్పాలనే ఇలా చేయించారనే ఆరోపణలు ఉన్నాయ్. ఎంతైనా పవర్ ని ఓ  సారి అనుభవించినతర్వాత దూరంగా ఉండటం అంత సాధ్యం కాదు, అందుకే ఇక తనపై ఉన్న కేసులనుంచి క్లీన్ గా బయటపడి, మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి కింగ్ కావాలనేది లాలూ ఆలోచనగా తెలుస్తోంది..

Lalu Prasad Yadav case created sensation all over India in 1990, in this case he was arrested also. Now JDU is trying to save him from this case.