టాప్ హిట్ లిస్ట్

13 Jun 2016ఐసిస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తన టాప్ టార్గెట్ అమెరికన్లేనంటూ మరోసారి ప్రకటించింది. 8వేల పై చిలుకు అమెరికన్ల పేర్లు, వారి అడ్రస్ లతో  ఓ లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో వారిని చంపడమే లక్ష్యంగా పని చేయాలని తన మెంబర్లను కోరడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.ఇస్లామిక్ స్టేట్‌ టెర్రరిస్ట్ గ్రూప్ హిట్ లిస్ట్ లో ఉన్న వారి జాబితా ఒకటి ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. తమకే చెందిన ఓ హ్యాకర్ గ్రూప్ తో ఈ లిస్ట్ బైటపెట్టిన ఐసిస్. అందులో 8318మంది పేర్లను పొందుపరిచింది. ఇందులో సదరు వ్యక్తులు ఈ మెయిల్ ఐడీలు..అడ్రస్ లు కూడా ఉండటంతో ఈ లిస్ట్ పై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇప్పటిదాకా రిలీజ్ చేసిన హిట్ లిస్ట్ లో ఇదే పెద్దది. ఐఎస్ 7,848 మంది అమెరికన్లు, 312 మంది కెనడియన్లు, 39 మంది బ్రిటన్లు, 69 మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారు.  ఈ నాలుగు దేశాల వాసుల పేర్లతో పాటు. బెల్జియం, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, గ్వాటెమాల, ఇండోనేషియా, ఐర్‌లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, జమైకా, న్యూజిలాండ్, ట్రినిడాడ్, టొబాగో, దక్షిణ కొరియా, స్వీడన్ వాసుల పేర్లు కూడా ఈ లిస్టులో ఉండటంతో ఐసిస్ తమ కార్యకలాపాలు ఎన్నిదేశాలకు విస్తరించింది అర్ధమవుతోంది. ఒకేటివ్ అనే మీడియా బైటపెట్టిన ఈ లిస్ట్ టెలిగ్రామ్ అనే మెసేజింగ్ యాప్ లో ఉన్నట్లు కనిపెట్టింది. 2015లో టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు. యునైటెడ్ సైబర్ కాలిఫేట్ గ్రూప్ గా ఏర్పడి. ఈ యాప్ ని వాడుతున్నాయట. ఒకేటివ్ ఈ లిస్ట్ మినహా మిగిలిన వివరాలు బైటపెట్టలేదు.

ISIS terrorist group announced its hit list. Recently it announced its hit list, in this list maximum numbers are Americans.