జంపింగ్ జంపాంగ్ ఎపిసోడ్ లో ట్విస్ట్

2 Jun 2016


ఆపరేషన్ ఆకర్ష్ వికటిస్తోందనే సిగ్నల్స్ అందుతున్నాయ్, వరసగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటూ, అదేదో అశ్వమేథయాగం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న చంద్రబాబుకి ఇప్పుడు ఆ జంపింగ్ జపాంగ్ లే షాక్ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయ్. తనకి లేని బలం తెచ్చుకుని రాజ్యసభకి రెండో ఎంపిని పంపిద్దామని ప్లాన్ చేసిన టిడిపికి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యి కన్పిస్తోంది. వచ్చిన ఎమ్మెల్యేలతో లోకల్ లీడర్లకి పడక, తన్నులాటలకు దిగుతుంటే, ఆ వచ్చినవాళ్లలో ఆరుగురు తిరిగి తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ నేతలు చెప్తుంటే ఇదేదో తమ మెడకి చిక్కుకున్నట్లు  ఉందని టిడిపి లోలోపల గుంజాటన  పడుతోందట.

ముందు టీడీపీకి మూడు స్థానాలుంటే, న‌లుగురిని రాజ్య‌స‌భ బ‌రిలో నిల‌పాల‌ని చంద్ర‌బాబు ఉత్సాహం చూపారు. కానీ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో నాల్గవ అభ్యర్థిని ఉపసంహరించుకున్నారనది టాక్. ఇక జగన్ కూడా తనకి కావాల్సినంత ఉంచుకుని, మిగిలినవారిని తన స్పైలుగా పంపారా? అనే డౌట్ కొడుతోంది. తన వారినే టిడిపిలోకి పంపి ఆ  పార్టీని బలహీనపరచాలని వేసిన ఎత్తుగడ ఫలించిందని వైసీపీలో కొంద‌రు లోలోన ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్రకాశం, పశ్చిమ గోదావరితో పాటు క‌ర్నూలు త‌దిత‌ర జిల్లాల‌లో గ్రూప్ తగాదాలు నెల‌కొన్నాయి. సిట్టింగులకు, జంప్ జిలానీల‌ గ్రూపుల మధ్య వివాదాలు ఆధిపత్య పోరు పెరిగిపోయింది. దీంతో ఇక వచ్చే ఎన్నికల సమయానికి జుట్టూ జుట్టూ పట్టుకునే స్థాయి ఏర్పడుతోందంటున్నారు. ఒకవైపు ఇలాంటి ఆపరేషన్ చేసి స్టీఫెన్‌సన్ ద్వారా కేసీఆర్‌కి దొరికిపోయి టీడీపీ అధినేత తెగ ఇబ్బందిపడుతున్నారు. కావాల్సినంత మంది ఉన్నా కూడా అనవసరంగా  జంపింగ్ లను ప్రోత్సహించిన పేరు తెచ్చుకున్నారని టిడిపి కేడర్ ఆందోళన పడుతోంది. కొత్తగా వచ్చి తమ ప్రాబల్యం కోసం జంప్ జిలానీలుయవ్వారాలపై ఇప్పటికే సిట్టింగ్ ఎంల్ఎల‌లో అసహనం కలుగుతోంది. అలా కిందపడ్డా జగన్ దే పైచేయిగా తేలుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.

Chandrababu Naidu is attracting YSRCP MLAs with bumper offers, and special packages. And he is trying to send four MP to Rajyasabha. But its become head ache to Chandrababu Naidu, A war is running between jumping MLAs and TDP MLAs.