ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ వస్తోందట

14 Jun 2016


నాలుగైదు నెలల క్రితం చీప్ రేట్ కే స్మార్ట్ ఫోన్లు ఇస్తామంటూ తెగ హడావుడి చేసిన రింగింగ్ బెల్స్ గుర్తుంది కదా..! ఇప్పుడా సంస్థ మళ్లీ హంగామా చేస్తోంది. జూన్ 28 నుంచి డెలివరీ ఇస్తానంటూ అనౌన్స్ చేయడంతో, నిజంగా డెలివరీ వస్తుందా, వస్తే ఆ పోన్ ఎలా ఉంటుంది అనే చర్చ జనంలో తిరిగి  ప్రారంభమైంది. స్మార్ట్ ఫోన్ 500 రూపాయలకే, కాదు 251 రూపాయలకే ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్. ఇలా రింగింగ్ బెల్స్ అనే నోయిడా కంపెనీ ప్రకటించడం ఆలస్యం, జనం వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్నారు. అసలింత తక్కువ రేటుకు ఓ మొబైల్ ఫోన్ ఎలా ఇస్తారంటూ టాప్ మేన్యుఫేక్చరికంగ్ కంపెనీలు కేసులు కూడా పెట్టాయ్. కేంద్రం కూడా ఈ ప్రకటనపై దర్యాప్తు చేయడంతో పాటు మానిటరింగ్ కూడా చేస్తామని చెప్పింది.

ఇప్పుడదే కంపెనీ జూన్ 28 నుంచి తమ స్మార్ట్ ఫోన్లు డెలివరీ ఇస్తామంటూ ఎనౌన్స్ చేయడంతో జనంలో చర్చ ప్రారంభమైంది. అప్పట్లో 7 కోట్లమంది కంపెనీ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోగా, 30 వేలమంది డబ్బు కూడా కట్టేశారని తెలుస్తోంది. వీళ్లలో 30 వేల మందికి మాత్రమే డెలివరీ వస్తుందా, లేక రిజిస్టర్ చేసుకున్నవాళ్లకి కూడా క్యూలో వస్తాయా అన్నది చెప్పలేదు కంపెనీ ప్రతినిధులు. అలానే డెలివరీ వచ్చే ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ నిజంగా పని చేస్తుందా, లేక టాయ్ ఫోనా అంటూ జోకులు కూడా పేలుతున్నాయ్. ఐతే ప్రపంచంలోనే ఓ స్మార్ట్ ఫోన్ 251 రూపాయలకు ఇవ్వడం అంటూ జరిగితే అదో అద్భుతంగానే ప్రస్తుతానికి చూడాలి.

Ringing Bells announced we will give smart phone for 251 rupees only before four month. So 7 crores of peoples  registered in website, and thirty thousand of people are paid money on online. So lets see what will happen.