బేకారీ ఎడ్యుకేషన్

3 Jun 2016


విద్యా విధానం ఎలాంటి స్థితిలో ఉందో తెలిసే సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. మామూలుగా ఓ విద్యార్ధి టాప్ ర్యాంక్ సాధించాడంటే, అతనికి సంబంధించిని సబ్జెక్టులపై అవగాహన ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ ఈ బీహారీ బేకారీ స్టూడెంట్లు మాత్రం తమ అజ్ఞానం బైటపెట్టుకున్నార. బిహార్ రాష్ట్రమంటే మామూలుగానే వెనకబడినదని అంటారు. అలాంటి చోట పరీక్షలు రాస్తుండగా గుట్టలు గుట్టలుగా బిల్డింగులు ఎక్కి మరీ కాపీలు అందించిన సన్నివేశాలు గతంలో చూశాం, అలాంటి చోట టాపర్లు కూడా వేస్ట్ అన్పించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్లస్ టూ అంటే ఇంటర్ లో టాపర్ గా నిలిచిన రూబీ రాయ్ ని పొలిటికల్ సైన్స్ అంటే వంటలశాస్త్రమని చెప్తోంది.

పైగా 500 మార్కులకు 444 మార్కులొచ్చాయ్ ఈ శుంఠాగ్రేసరికి, అసలు ఎన్ని మార్కులకు పరీక్ష జరిగిందని అడిగితే 600 కి అని చెప్పడం చూస్తే, బీహార్ లో విద్యావిధానం ఎంత గొప్పగా సాగుతుందో తెలుస్తోంది. మరో టాపర్ సౌరభ్ కుమార్ దీ అదే సిచ్యుయేషన్ పరీక్షల్లో కాపీ కొట్టడం వల్లనే తనకా మార్కులు వచ్చాయని గొప్పగా సెలవిస్తున్నాడు. ఇలాంటి వారికి ర్యాంకులు వస్తున్నాయంటే అది బిహారీల గొప్పదనమే అనుకోవాలి, ఐతే ఈ వీడియో నెట్ లో చక్కర్లు కొడుతుండటంతో ఈ ఇష్యూపై విచారణకి విద్యాశాఖ ఆదేశించింది. వీరందరికీ జూన్ లో మళ్లీ పరీక్షలు పెట్టబోతున్నారు.

It is the best example how education system is going in Bihar. Toper of Intermediate answered about question of her subjects is very funny.