క్రిష్ పెళ్లి కుదిరింది

11 Jun 2016


గమ్యంతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరుతెచ్చుకున్న జాగర్లమూడి రాధాకృష్ణ ఉరఫ్ క్రిష్ ఎట్టకేలకు పెళ్లి బాజాలు మోగించబోతున్నాడు. హీరోయిన్లను తలదన్నే అందంతో కన్పించే రమ్య అనే పేరున్న డాక్టర్ తో ఈ ముదురు దర్శకుడి పెళ్లి జరగబోతోంది. సినిమా ఇండస్ట్రీలో 37 ఏళ్లంటే పెద్ద వయసు కాదు కాబట్టి, ఎర్లీగా మ్యారేజ్ జరుగుతున్నట్లే లెక్క. అందులోనూ టాప్ హీరోయిన్ తో లవ్వాయణం నడిపాడని మనోడిపై కొన్నాళ్లు పుకార్లు నడిచాయ్. అలాంటి వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేసి, వచ్చే శ్రావణంలో రమ్యని పెళ్లాడుతున్నట్లు చెప్తున్నారు. 

మణికొండ ఏరియాలో కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు చెప్తున్నదాని ప్రకారం అమ్మాయి తరపున వందకోట్ల ఆస్థి కలసి వస్తుందని వినికిడి, ఐతే ఇలాంటి మాటలు ఎలా ఉంటాయంటే (లక్షకోట్ల అవినీతి వందకోట్ల కట్నం, పాతికలక్షల ముడుపులు). ఇవన్నీ పడికట్టు పదజాలంలా వాడటమే తప్ప, ఈ అమౌంట్లు నిజంకావు. ఏది ఎలాగున్నా రీసెంట్ కంచె తో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్, ఇప్పుడు బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి పని చేస్తున్నాడు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తవగానే పెళ్లిడేట్ బయటకు రావచ్చని టాక్.

Director Krish got popularity with Gamyam movie. Now he is very busy with Balakrishna 100 movie. Recently he got engaged with a doctor. Shortly he is going to marry.