ఓ మాజీ ప్రధాని ఇలా మాట్లాడొచ్చా

7 Jun 2016


మాజీ ప్రధాని దేవెగౌడ మరోసారి కలకలం రేపారు. కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా కర్నాటక బిడ్డ అంటూ మద్దతు పలికి సంచలనం రేపిన ఆయన, తాజాగా తమ ఎమ్మెల్యేలు రాజ్యసభ సీటుకోసం డబ్బు తీసుకుని ఓటేస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. దీంతో కర్నాటకలో రాజకీయదుమారం రేగుతోంది. రాజ్యసభ ఎంపిల ఎన్నికకు ఎమ్మెల్యేలు డబ్బు డిమాండ్ చేస్తే తప్పేంటి, ఇలా అడుగుతున్నది ఏ ఛోటా నేతో కాదు సాక్షాత్తా మాజీ ప్రధాని. కర్నాటకకు చెందిన ఆయన బ్యాంకులకు టోపీ పెట్టిన విజయ్ మాల్యా కి కూడా రెండు నెలల క్రితం సపోర్టిచ్చేశారు.

కర్నాటక రాష్ట్రానికి చెందిన దేవెగౌడ ప్రధానిగా పదవి నిర్వహించిన సమయంలోనూ కునుకు తీస్తూ, అలసత్వంగా ఉండేవారని కామెంట్లు వచ్చేవి. ఇప్పుడు తాజాగా తన వ్యాఖ్యలతోనూ కలకలం రేపుతున్నారు దేవెగౌడ. ఎన్నికలలో పోటీ చేయాలంటే డబ్బులు కావాలని చెప్పారు దేవెగౌడ. రాజకీయాలు కలుషితం అయ్యాయంటూ ఆయనే సెలవిచ్చారు. ఐతే అంతలోనే మళ్లీ  ఎమ్మెల్యేలు డబ్బు అడిగితే తప్పు ఏంటంటూ ప్రశ్నించడం విచిత్రంగా అన్పించకమానదు. ఆయన మనసులోని మాటే బయటపెట్టారో, లేక యధాలాపంగా అన్నారో కానీ, జనం మాత్రం దేవెగౌడప్పా.. ఏమైందప్పా అనుకుంటున్నారు.

Ex prime minister Deva Gouda comments creating sensation. Already he was hot topic in media while commenting on Vijay malya. Recently he commented on Politics.