సంతానంపై దెబ్బ మీద దెబ్బ

11 Jun 2016


తమిళ్ కమెడియన్ సంతానంపై విధి పగబట్టినట్లు దెబ్బ తీస్తోంది, చెన్నైలో ఆయన తండ్రి నీలమేఘం చనిపోయారు. ఎఁతో కష్టపడి కిందనుంచి పైకొచ్చిన సంతానం ఇప్పుడు హీరో రేంజ్ కి ఎదిగాడు. 69 వ ఏట చనిపోయిన నీలమేఘం తన కుమారుడు పెద్ద స్థాయికి చేరడం కళ్లారా చూసి ఎంతో ఆనందించారంటారు. అలాంటి తండ్రి చనిపోవడంతో సంతానం శోకసంద్రంలో మునిగిపోయాడు. సినిమా ప్రముఖులు సంతానం ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు.

సంతానం కుమారుడు కూడా ఇలానే అకస్మాత్తుగా చనిపోయాడు. ఆ విషాదం జరిగి ఏడాది గడవకముందే ఇలా జరగడంతో సంతానం తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట. ఓసారి కుమారుడు, ఇప్పుడు తండ్రి ఇద్దరూ కన్నుమూయడంతో ఓ రకమైన నిర్వేదంలో సంతానం కుటుంబం మునిగిపోయింది.

Continuous shocks to Tamil Comedian Santhanam. Recently his father Neelamegham was died. And another shock to him, his son was also suddenly died.