చిరంజీవి చేసిన మోసానికి ఏం చేయాలి?

8 Jun 2016


ఛోటా కే నాయుడికి, చిరంజీవి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం కాపు సోదరులకు, మెగా ఫ్యాన్స్ కి బాగా తెలుసు. ఆయన ఎంత గొప్ప కెమెరామెన్ అయినా, ఓ వర్గానికి మాత్రమే ప్రతినిధిగా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఆ వర్గం హీరోలతో మాత్రమే సన్నిహితంగా మెలుగుతారు. అలాంటి ఛోటా కే నాయుడు పేల్చిన జోక్ ఇప్పుడు వళ్లు మండించకమానదు. డాడీ అని 2001-2002 మధ్య ఓ సినిమా వచ్చింది, అది హిట్ అని కాదు యావరేజ్ అని అప్పట్లో చిరంజీవి ఫ్యాన్స్ చెప్పుకునేవాళ్లు. ఐతే ఇప్పుడు చోటా ఏం చెప్పాడంటే, ఆ సినిమా ఫ్లాపైంది దానికి కారణం చిరంజీవి అనే పెద్ద హీరో సినిమాలో మిత్రుల చేతిలో మోసపోవడం ప్రేక్షకులకు నచ్చలేదు అని, ఛోటా అనలేజేషన్ బాగానే ఉంది.

రీల్ లైఫ్ లోనే చిరంజీవిని మోసం చేయడం జనాలకు నచ్చలేదు అంటున్న చోటా కే నాయుడు, మరి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు చేసిన ద్రోహం, మోసం ఎవరికైనా నచ్చుతుందా. పార్టీ కాంగ్రెస్ సముద్రంలోకి కలిపేశాడు, ఆ తర్వాత గెలిపించిన తిరుపతి జనాలకు కన్పించకుండా, ఏ పనీ చేయకుండా ఇంకెంత మోసం చేశాడు. తర్వాత రాజ్యసభ ఎంపిగా ఏం ఒరగబెట్టాడో ఏనాడైనా చెప్పారా, ఇన్ని మోసాలు చేసిన చిరంజీవి ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తే అవన్నీ గుర్తు పెట్టుకుని రివర్స్ పంచ్ వేస్తే ఎలా ఉంటుందో ఊహించగలరా..?

 Chiranjeevi cheated AP people. In 2009 he was elected form Thirupati, later he joined in Congress. He cheated Tirupathi people and Congress party.