ఏయ్..ఏంటి చంద్రబాబు అరుపులు

11 Jun 2016


ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి తన అసలు ఉగ్రరూపం అధికారులకు చూపించారు. ఉద్యోగస్థులు అమరావతికి వెళ్లాల్సిందే అని తేల్చి చెప్పడంతో దాదాపు నెలరోజులనుంచి వాళ్లంతా కలిసి అందరినీ కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇదే క్రమంలో నిన్న క్యాంప్ ఆఫీస్ దగ్గర మరోసారి చంద్రబాబును కలిసి కనీసం ఆర్నెల్లు ఈ తరలింపులో తాలింపును ఆపేయమన్నారు. అంతే ఒక్కసారిగా చంద్రబాబుకి పూనకం వచ్చినట్లైే.." ఓ సిఎంతో మాట్లాడే తీరిదేనా..? పెడసరంగా మాట్లాడొద్దు, సస్పెండ్ చేస్తా.." అంటూ ఊగిపోయారు. రోడ్ మ్యాప్ కూడా ఇవ్వలేదని మాట్లాడిన ఏవీ పటేల్ అనే ఉద్యోగి పై మండిపడ్డారు. అసలు ఇంతదాకా వచ్చాక, భార్యా పిల్లలంటూ వెనక్కి పోవడమేంటి, మాకు భార్యా బిడ్డలు లేరా అని ఆవేశపడ్డారు చంద్రబాబు. 

నిజానికి చంద్రబాబు ఇలా ఊగిపోవడానికి కారణం పురంధ్రీశ్వరిని ఈ ఉద్యోగుల సంఘం కలవడమేనట, పోయి మిగిలినవాళ్లను కలిస్తే జరిగేది ఆగుతుందా, అడిగినదల్లా చేసిన తనకి చెప్పకుండా ఆమె దగ్గరకు వెళ్లడమేంటనే ఆవేదన చంద్రబాబులో కన్పించింది. ఈ విషయంలో చంద్రబాబుని ఎవరూ తప్పుపట్టలేరు, ఎందుకంటే ఉద్యోగులు ఇవాళ కాకపోతే ఆర్నెల్ల తర్వాతైనా వెళ్లాల్సిందే కదా. ఇప్పుడే అడ్మిషన్లు దొరకకపోతే, ఆర్నెల్ల తర్వాత అమరావతిలో పిల్లలకు అడ్మిషన్లు దొరుకుతాయా..? త్యాగం చేస్తామన్న ఉద్యోగస్తులు వారానికి ఐదురోజులు కూడా ఇక్కడ పని చేయలేనప్పుడు ఇలాంటి ఆగ్రహావేశాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మచ్చుకు ఒకటి మాత్రమే, ఇలాంటివి ఇంకా ఎన్నో చూడాలి. ఎఁదుకంటే గవర్నెమెంట్ ఓ జీవో జారీ చేసిన తర్వాత ఇక్కడే కూర్చుంటామంటే ఉన్న ఉద్యోగాలు ఊడతాయనే సంగతి తెలీదా..?

AP CM Chandrababu Naidu was fired on AP Secretariat employees. They not interesting to come to Amaravathi. So Chandrababu Naidu warned them.