బాబు గారి ఖ‌ర్చు గంట‌కి కోటి..!

26 Jun 2016


ఆంద్రప్ర‌దేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఆదుకోవాలంటూ సీఎం చంద్ర‌బాబు చాలా మార్లు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అంత‌టితో స‌రిపెట్ట‌డం లేదు ప్ర‌జ‌ల నుంచి విరాళాలు కూడా సేక‌రిస్తున్నారు. రాజ‌ధానికి ఓ ఇటుక కొనండి అంటూ కూడా దుకాణం పెట్టారు. ఆతర్వాత తోచినంతా ఇవ్వాలంటూ ఆయ‌న తీసుకుంటున్నారు కూడా. అయితే ఆయ‌న మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. రెండేళ్ల‌కే ఖాళీ చేస్తున్న హైద‌రాబాద్ సెక్ర‌టేరియేట్ రీమోడ‌లింగ్ కోసం ఆయ‌న వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇప్పుడు తాత్కాలిక సెక్ర‌టేరియేట్ కోసం అదే రీతిలో సాగుతున్నారు. ఆ విషయానికి తోడుగా ఆయ‌న ప్ర‌యాణించే బ‌స్సు కోస‌మే ఆయ‌న కోట్లు వెచ్చించారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబుగారి దుబారా ఓ స్థాయి దాటిపోతోంది.

ఇప్పుడు దానికి ప‌రాకాష్ఠ‌గా ఓ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల వివిధ జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు ప‌ర్య‌ట‌న‌కు ఆయ‌న బ‌య‌లుదేరుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు మ.2.15లకు ఆయన ఒంగోలు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా జేబీఎం చర్చిలో ఆయన ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం తాగునీటి పథకం పైలాన్‌ ఆవిష్కరిస్తారు. మ.3 గంటలకు ఒంగోలు మినీస్టేడియంలో జరిగే బహిరంగసభ ఆయన పాల్గోని రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేయనున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న తిరిగి విజ‌య‌వాడ ప‌య‌న‌మైపోతారు. అంటే సుమారు రెండు గంట‌ల పాటు ఆయ‌న ఒంగోలులో ప‌ర్య‌టిస్తారు. కానీ ఆ రెండు గంట‌ల కోసం పెడుతున్న ఖ‌ర్చు చూస్తే మాత్రం అంతా నోరెళ్ల‌బెట్టాల్సి వ‌స్తుంది. బాబు గారి ఖ‌ర్చు గంట‌కి కోటి రూపాయ‌ల చొప్పును పెట్టాల్సి వ‌స్తోంద‌ని అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. ఒంగోలు ప‌ర్య‌ట‌న కోసం ఆయ‌న పాల్గొన‌బోయే స‌భ ప్రాంగ‌ణం ఏర్పాట్ల కోసం కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌బోతున్నారు. ఆ వ్య‌వ‌హారం ఇప్ప‌టికే ఓ కాంట్రాక్ట్ సంస్థ‌కి అప్ప‌గించారు. హైద‌రాబాద్ కి చెందిన సంస్థ ఈ వ్య‌వ‌హారం చ‌క్క‌బెడుతోంది.

దానికితోడుగా జ‌న‌స‌మీక‌ర‌ణ కోసం మ‌రో కోటి రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతున్నారు. ప్ర‌చారం, వాహ‌నాలు, హాజ‌ర‌యిన వారి వ్య‌వ‌హారాలు అన్నీ ఇందులో భాగంగా భావిస్తున్నారు. మొత్తంగా చంద్ర‌బాబు స‌భ ఖ‌ర్చు రెండు గంట‌ల‌కు రెండు కోట్లు అవుతుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. దానికి అద‌నంగా టీవీ లైవ్ క‌వ‌రేజ్ పేరిట ఏబీఎన్ కి ఇచ్చే ల‌క్ష‌ల రూపాయ‌లు స‌హా అనేకం అద‌నం. అన్నీ క‌లుపుకుంటే ఈ ఖ‌ర్చులు త‌డిసిమోప‌డ‌వుతున్న‌ట్టు భావించాల్సి వ‌స్తోంది. ఇది ఒక జిల్లా ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. రాష్ట్రంలో ఆయ‌న ప‌ర్య‌టన‌ల సంద‌ర్భంగా అన్ని చోట్లా ఇలాంటి భారీత‌న‌మే సాగుతున్న‌ట్టు చెబుతున్నారు. మొత్తంగా ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం చూస్తుంటే ఆయ‌న పంపిణీ చేసే అప్పులు ఎంతో తెలియ‌దు గానీ..ఆ పేరుతో సాగుతున్న వ్య‌యం మాత్రం భారీగా క‌నిపిస్తోంది.

From the time of state division AP is in low budget. To give job notification Chandrababu Naidu is telling, no budget. But he spending one crore money for hour.