బాబు ఒక్క పేద రియల్ ఎస్టేట్ వ్యాపారి..

13 Jun 2016


రియల్ ఎస్టేట వ్యాపారం కోసమే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి వచ్చారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.పదేళ్లు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా, చంద్రబాబు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారని ఆయన అన్నారు.చంద్రబాబు అనుచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతంలో ఇష్టానుసారంగా భూములు కొన్నారని ఆయన ఆరోపించారు.

రాజదాని నిర్మాణ టెండర్లను రహస్యంగా ఉంచుతున్నారని , జిఓలను ఆన్ లైన్ లో పెట్టడం లేదని,ఇదంతా విచ్చలవిడిగా దోచుకోవడానికేనని పెద్దిరెడ్డి విమర్శించారు.రెండేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు లక్షాఏభై వేల కోట్ల రూపాయల దోపిడీ చేశారని ఆరోపించారు.ప్రశ్నించే ప్రతిపక్షం ఉండకూడదనే వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు. అవినీతిని ఎండగట్టినందుకే సాక్షి ప్రసారాలను ఆపు చేస్తున్నారని రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

YSRCP MLA commented about Chandrababu naidu. He is doing real estate business. To do this business he to Vijayawada form Hyderabad.