చంద్రబాబు దోపిడీ రాజ్యం

13 Jun 2016


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా దోపిడీపై దృష్టిపెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి విమర్శించారు. మంగళవారం జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు రెండేళ్ల పాలనలో వైఫల్యాలు, దోపిడీపై చర్చించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు హాజరుకానున్నట్టు చెప్పారు.

చంద్రబాబు ఏపీ నూతన రాజధానిలో భూములు దోచుకున్నారని పార్థసారథి ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చంద్రబాబు కెమెరాకు చిక్కారని చెప్పారు. ఏపీలో చంద్రబాబు నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

YSRCP Leader Pardha Saradhi fired on Chandrababu Naidu. He is not thinking about election promises, and he is concentrating on money earning.