వైఎస్ పై చంద్రబాబు అక్కసు

10 Jun 2016


ఎన్ని చేసినా? పాత స్కీములకు కొత్త పేర్లు తగిలించుకున్నా? చంద్రబాబును ఎవరూ పొగడటం లేదని ఓ దుగ్ధ ఉందంటారు. అది చాలా సందర్భాల్లో బైటపడుతుంటుంది. ఇప్పుడు కాపు రిజర్వేషన్ల రగడపై ముద్రగడ చేస్తున్న దీక్షల సమయంలో మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు చంద్రబాబు. ఏపీలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయ్. అర్ధం చేసుకోండి అంటూనే ఒక్కసారిగా వైఎస్ హయాం దగ్గరకు వెళ్లిపోయాడాయన. కాపులకు రిజర్వేషన్ల అంశంపై వైఎస్ వైఖరి వేరని, కానీ ఆయనేమో దేవుడయ్యాడు. రిజర్వేషన్ల అంశంపై ఓ కమిషన్ వేసిన నేనేమో శత్రువును అయ్యానా? అంటూ వాపోయారు చంద్రబాబు. 

ఓ వ్యక్తిని దేవుడని కొంతమందైనా అనుకుంటున్నారంటే అది అతను చేసిన పనులను బట్టే ఉంటుంది. ఇది తెలియకుండా ఊరికినే వైఎస్ పై విమర్శలు చేసినంత మాత్రాన ఒరిగేదేం ఉండదు. కాపు రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా? ఇదే డైరక్ట్ క్వశ్చెన్ దీనికి అంతే సూటిగా ఇస్తామని చెప్పి ఉంటే చంద్రబాబుకి క్రెడిబులిటీ  రావడమే కాకుండా, ముద్రగడ దీక్షలకు బెదిరింపులపై ఎవరూ స్పందించరు కానీ, అలా చేయకపోబట్టే కదా? ఇలా వాపోవాల్సి వస్తోంది, అర్ధం చేసుకోండి బాబూ...!

Chandrababu Naidu showing his jalousie on Rajaskar Reddy. He cheating AP people by changing name of  Rajashekar Reddy schemes.