రేవంత్ మీద మరో కేసు

4 Jun 2016


తెలంగాణ తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మీద మరో కేసు నమోదు అయ్యింది. ఓటుకు నోటు కేసులో బుక్ కావటమే కాదు.. దాదాపు నెల రోజుల పాటు ఆయన జైల్లో ఉండటం తెలిసిందే. బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన.. ఆచితూచి మాట్లాడుతున్నారే కానీ గతంలో మాదిరి ఊరికే విరుచుకుపడటం లేదు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా క్యాంపస్ లో నిర్వహించ తలపెట్టిన జన జాతరకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ.. ఈ జాతరను ఉస్మానియాలో నిర్వహించారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి రేవంత్ తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు సైతం హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తూ జన జాతరకు వెళ్లటంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరి.. ఈ కేసు రేవంత్ ను ఎంతలా చికాకు పెడుతుందో చూడాలి.

TDP fire brand Revanth Reddy is now facing Vote for Note case. Now an another case is filed on Revanth Reddy. He exceeded court rules.