మోడీకి మరో బోనస్

8 Jun 2016


భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఊహించని  బోనస్ దొరికింది, ఎన్నాళ్లుగానే చోరీకి గురై దేశాంతరంలో ఉన్న అనేక ప్రాచీన విగ్రహాలు ఇప్పుడు ఇండియాకు వస్తున్నాయ్. భారతదేశం అభ్యర్ధన మేరకు అమెరికా ప్రభుత్వం ప్రాచీన సంస్కృతికి సాక్ష్యాలైన 200 విగ్రహాలను తిరిగి అప్పగిచ్చింది. ఎప్పుడో చోరీకి గురై అమెరికా బ్లెయిర్ హౌస్ లో కొలువున్న భారత కళాఖండాలను అమెరికా ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ కి అప్పగించింది. 2 వేల ఏళ్ల నాటి ఈ విగ్రహాల విలువ దాదాపు 667 కోట్లు ఉండొచ్చు, ఇలా 200 సాంస్కృతిక కళాఖండాలను తిరిగిఇవ్వడంపై భారత ప్రధాని మోడీ తన అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. వాయి్సప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బహుమతులు పెంచడం అన్నది చాలా అరుదు. కొన్నిసార్లు మనుషులు చేయలేనిది, విగ్రహాలు చేస్తాయంటూ మోడీ ప్రసంగం సాగింది. ఎన్డీఏ హయానికి ముందు ఇలాంటి ప్రయత్నాలు జరిగినా, పెద్దగా ఫలితం ఇవ్వలేదు. 

అమెరికా అప్పగించిన వాటిలో దేవతా విగ్రహాలు, టెర్రాకోట భాగాలు, చెన్నైలోని శివాలయం నుంచి దొంగిలించిన చోళుల కాలంనాటి సెయింట్‌ మాణిక్కవిచావకర్‌ విగ్రహం, వెయ్యేళ్ల నాటి గణేశుడి కంచు విగ్రహాలున్నాయి. వీటన్నింటినీ కూడా సుభాష్ కపూర్ అనే ఇంటర్నేషనల్ స్మగ్లరే దేశం దాటించాడని ఆరోపణలున్నాయ్. ఇప్పుడు భారత సంప్రదాయాలకు సంస్కృతికి నిదర్శనమైన ఈ కళాఖండాల రాకతో చరిత్రకారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఐతే ఈ సందర్భంలో మోడీ ప్రసంగం కామెడీ కూడా క్రియేట్ చేసిందట. ఏదో టెంపుల్ లో రతిభంగిమల్లో ఉన్న విగ్రహాలను కూడా పురాతన విగ్రహాలుగా మనోళ్లే వాటిని చెక్కినట్లుగా ఆయన ప్రసంగించడంతో చరిత్ర తెలీని మోడీ అంటూ మరోసారి విమర్శలకు ప్రతిపక్షాలు సిధ్దం అయ్యాయ్.

Present PM Naredra Modi is in America trip. In this trip he got bumper offer. America gave India's status return to India.