బల్బ్ పై జయ ఫోటో

15 Jun 2016


తమిళనాడులో ఇప్పటికే సిఎం జయలలిత పేరుతో ఉన్న పథకాలకు మరో స్కీమ్ జోడైంది. ఇంట్లో అడుగుపెట్టగానే ఆమే కన్పించేట్లుగా కరెంట్ బల్బ్ పై జయ ఫోటో ప్రింట్ చేయడంతో ఇక అమ్మ కరెంట్ కూడా అరవనాట ప్రసారం కాబోతోంది. అమ్మ కేంటీన్, సైకిల్స్, మిల్క్ ఇలా ప్రతి పథకంలో తమిళనాడులో జయలలిత ఫోటో కన్పిస్తుంటుంది. తాను వరసగా రెండోసారి ఎన్నిక కావడంలో ఈ పథకాలే బాగా ఉపయోగపడ్డాయని జయలలిత నమ్ముతుంటారు. వీటిలో నిజం ఎంత ఉన్నా, జనం కూడా వీటిపై ఎక్కువ మక్కువ పెంచుకున్నారనడంలో సందేహం లేదు.

అరవనాట జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారంలో జయలలిత తాను గెలిస్తే, 100యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీను అమలుపరుస్తూ కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. అందులో భాగంగా ఓ యువకుడు బల్బుపై జయలలిత ఫోటో ప్రింట్ చేసి ఇంట్లో వేలాడదీసుకున్నాడు. అక్కడి ప్రభుత్వం దీన్ని త్వరలోనే అన్ని ప్రాంతాలకు అమలు చేసే ఆలోచన చేస్తుందంటున్నారు. అదే నిజమైతే, ఇక కరెంట్ లైట్ లో కూడా జయలలితే కన్పిస్తారనడంలో సందేహం లేదు.

In Tamilnadu Jayalalitha formed government second time. In election promises she told free power to below 100 volts user. In that way she is giving free bulbs with her photos.