బిచ్చగాడికి 10కోట్లు వచ్చాయ్

15 Jun 2016


అసలు నిజం బిచ్చగాళ్లే ఎక్కువ సంపాదిస్తున్న ఈరోజుల్లో అదే టైటిల్ తో వచ్చిన బిచ్చగాడు సినిమా పది కోట్లు కలెక్ట్ చేస్తుందన్నది ఓ సంచలనమే. ఎఁదుకంటే ఈ సినిమా రైట్స్ కి కేవలం 50 లక్షలు ఖర్చైందిట. బాహుబలి క్లైమాక్స్ కి 30 కోట్లు ఖర్చు పెడుతున్నారనే న్యూస్ తెలుసుకున్నప్పుడు బిచ్చగాడు కలెక్షన్స్ వింటుంటే, అంత అవసరమా అన్పించకమానదు. పిచ్చైకారన్ కి డబ్బింగ్ అయిన ఈ సినిమా పబ్లిసిటీ పరంగా బాగా ఖర్చు పెట్టడంతో ఇప్పటికే 8 కోట్లు కలెక్ట్ చేసి..పదికోట్లు వసూలు చేసిన డబ్బింగ్ మూవీగా నిలవబోతోంది. చదలవాడ శ్రీనివాసరావ్ అనే టింబర్ డిపో యజమాని ఇది రిలీజ్ చేశారు. బహుశా వీళ్లు అనురాధ డివిజన్స్ చదలవాడ తిరుపతిరావుకి చుట్టాలని అంటున్నారు.

ఐతే ఇదే సినిమా మిస్సయ్యానని దగ్గుబాటి రానా ఫీలవడం విచిత్రం ఎందుకంటే, ఆయనగారు ఆ సినిమాకి ఒప్పుకున్నా బడ్జెట్ ఖచ్చితంగా ఓ ఇరవైకోట్లకి చేర్చి ఉండేవాళ్లు, అప్పుడీ బడ్జెట్ కి తగ్గట్లు కలెక్షన్లు వసూలు చేయలేక ఆపసోపాలు  పడేవాళ్లు
అందుకే ఎవరు చేయాల్సిన  పని వాళ్లు చేయాలి. ఇప్పుడు కత్తి డబ్ చేయకుండా, రీమేక్ చేస్తున్నారు. దానికి వివివినాయక్ కి ఓ నాలుగైదు కోట్లు, ప్రొడక్షన్ కి 40కోట్లు రెమ్యునరేషన్లు మరో 10కోట్లు కలిపి కనీసం 60కోట్లు చేస్తారు. ఇవన్నీ కలిపి తడిసి మోపెడై రేపు బయ్యర్ల పంచలు తడిపేలా చేస్తారు. అందుకే దేనికి ఎంత  ఖర్చు పెట్టాలి, ఎలా విడుదల చేయాలనేది తెలుసుకుంటేనే సినిమారంగంలో లాభాలు వస్తాయ్. ఐతే ఈ సూత్రం ఎంత తెలిసినా, ఒక్కోసారి ఫాలో అవలేకపోవడమే ఇందులోని మరో విచిత్రం.

Recently Bishkagadu movie was released and got good talk at box office. But its collection was really shock to movie experts. It collects 10 crores.