భూమా సిచ్యుయేషన్ బాలేదా..

2 Jun 2016


టిడిపి ఆఫీస్ లో ప్రెస్ మీట్లు పెడుతున్న భూమా నాగిరెడ్డి భాధ ఏంటో ఎవరికీ ఆర్ధం కాలేదు, ఆయన ఇంకా వైసీపీలోనే ఉన్నాడేమో అని డౌట్ రావడం సహజం. ఎందుకంటే అసలు విజయసాయిరెడ్డికి జగన్ కి వైఎస్సార్సీపీకి ఏంటి సంబంధం అని ఆయన వాపోయారు, పార్టీలో ఎప్పట్నుంచో పని చేస్తున్నవాళ్లుండగా, ఆయనకి ఎందుకు ఎఁపి టిక్కెట్టని  ప్రశ్నించిన నాగిరెడ్డి, అది ఆ పార్టీ సంగతని గ్రహించలేదా.. ఓ వేళ ఆయన వాదనే నిజమైతే, మరి భూమానాగిరెడ్డిని నెత్తినపెట్టుకున్న టిడిపి మరి అక్కడ నేతలు, కార్యకర్తలు ఎప్పటికీ అలానే ఉండాలా అని ఆలోచిస్తే, ఆయనకి మళ్లీ టిక్కెట్ ఇవ్వగలదా..? పైగా ఈ జంప్ జిలానీ నాలుగో కాండిడేట్ ని నిలబెట్టి, గెలిపిస్తామని హామీ ఇచ్చినా చంద్రబాబు వద్దన్నారని, నిజాయితీకి మారుపేరని మోసేశాడు. 

మరి అంత నిజాయితీ పరుడునుంచి 2009 లో ఎందుకు బైటికి వచ్చాడీయన..? ఆ తర్వాత టిడిపిలోకి వెళ్లకుండా, వైఎస్సార్సీపీలోకి  ఎందుకు వచ్చాడు. ఎప్పటికప్పుడు చొక్కాలు మార్చే భూమానాగిరెడ్డి నిజాయితీ గురించి ఎందుకు మాట్లాడి అభాసు పాలు కావాలి..? పైగా చంద్రబాబునాయుడు జంపింగ్ జపాంగ్ లతో వచ్చిన గెలుపు అక్కర్లేదని అన్నాడని చెప్తున్న భూమూ, మరి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మాత్రం నైతికత అని ఎలా చెప్తాడో ఏ మాత్రం డౌట్ రాలేదా..? అందుకే పాపం భూమానాగిరెడ్డికి ప్రస్తుతం పరిస్థితి బాలేదనిపిస్తోంది. ఏదో ఆశించి టిడిపిలోకి వెళ్తే అక్కడా తనకి పెద్ద గుండుసున్నానే ఎదురవుతుండటంతో మతి భ్రమించిందని చెప్పకతప్పదు.

Present YSRCP jumped Bhuma Nagi Reddy situation is very bad position. All people are thing that he is still in YSRCP, his talks are like that. He is commenting about YSRCP Rajyasabha seat.