కబాలిలో బాలసుబ్రహ్మణ్యం ఎందుకు పాడలేదు

11 Jun 2016


ఇప్పుడిదే టాపిక్ మ్యూజిక్ లవర్స్ ని వేధిస్తోంది, ఏ హీరోకి పాడుతుంటే ఆ హీరోనే పాడాడా అన్నట్లుగా మిమిక్ చేయగల టాలెంట్ ఎస్పీ బాలు సొంతం. 70 ఏళ్లు దాటినా, ఇంకా తన మాధుర్యంతో ఆకట్టుకునే బాలు తమిళ్ వెటరన్ స్టార్స్ కమల్ , రజనీకి వాయిస్ ఇవ్వకుండా ఏ సినిమా కూడా రిలీజ్ అవదు. వాళ్లతో ఆయనకి అంత అనుబంధంతో పాటు, తన వాయిస్ సెట్ అవడం కూడా కలిసొస్తుంది. సతి లీలావతి తర్వాత కమల్ కి, ముత్తు నుంచి రజనీకాంత్ కి నాగూర్ బాబు అలియాస్ మనో గొంతు అరువిస్తున్నాడు కానీ. అంతకు ముందు కూడా వీళ్లిద్దరికీ వాయిస్ ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యమే..! ఐతే ఇప్పుడు తరం మారుతుండటంతో, ఈ హీరోల వాయిస్ కి యూత్ గొంతు అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయ్.

అందులో భాగంగానే రజనీకాంత్ రీసెంట్ మూవీ కబాలికి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఒక్కటంటే ఒక్కటి కూడా  లేదట. కబాలి ఆడియో రిలీజ్ భారీగా ఉందనుకున్నా. ఆ ఫంక్షన్ కాస్తా రద్దవడంతో, ఇక డైరక్ట్ గా సినిమా పాటలు విడుదల అవుతాయంటున్నారు. దీంతో సినిమా యూనిట్ ముందుగా ఆడియో ట్రాక్ రిలీజవగా, అందులో బాలు పేరు లేని సంగతి బైటికి వచ్చింది. అన్నట్లు కబాలి కి మ్యూజీషియన్ సంతోషన్ నారాయణన్ మార్కెట్లో ఈ పాటలు హిట్టైతే ఈయన్ని మెచ్చుకుంటారు కానీ, లేకపోతే అధి విమర్శల పాలవడం ఖాయం.

Singer SP Balasubramanyam is proud to Telugu music fans. For every Rajanikanth movie, Bala Subramanyam giving voice. But to Kabali movie he did not gave voice.