బాహుబలి మరింత లేట్ అవుతుందా

18 Jun 2016


ఓ సినిమా హిట్టైతే, అదే కాంబినేషన్ లో వచ్చే మరో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయ్. ఐతే బాహుబలి హిట్టవడం, ఆ టీమ్ లో కాన్ఫిడెన్సే పెంచిందంటారు. ఇప్పుడా టీమ్ తమ సీక్వెల్ కోసం చెమటోడ్చి షూటింగ్ చేస్తున్నారంటారు. ఐతే ఫస్ట్ పార్ట్ లో కొద్దిగానే కన్పించిన అనుష్క, సీక్వెల్ కానీ, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో కానీ, ఎక్కువ పాత్రలో కన్పించే అవకాశం ఉంది. ఐతే ఇంతవరకూ ఆమె యూనిట్ లో జాయినవలేదని చెప్తారు. ఆల్రెడీ రెండో షెడ్యూల్ జరుగుతుందని, అఁదులో అనుష్క షెట్టి జాయినైనా బాగా లావుగా ఉందంటూ రాజమౌళి చిరాకు పడ్డాడని ఓ పత్రిక కథనం. ఇది బాగానే ఉంది కానీ, అసలు బాహుబలి రిలీజ్ కి ముందు, రిలీజైన తర్వాత రాజమౌళి ఇంటర్వ్యూలు జాగ్రత్తగా పరిశీలిస్తే, సెకండ్ పార్ట్ లో 60శాతం సీన్లు తీసేశానని చెప్పాడు. మరిప్పుడు మిగిలిన నలభై లేదంటే సగం సినిమా కోసం ఇంత కష్టపడుతున్నాడంటే, నిజమేనా అన్పించకతప్పదు. తెగ బిల్డప్ ఇస్తూ ఓ భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతున్నట్లు ఇంటర్వ్యూలు ఇచ్చే ఆ టీమ్ మెంబర్ల మాటల్లో నిజమెంతో దీంతోనే అర్ధం కావడంలేదూ..!

Baahubali movie was a biggest hit, and it won National award. Now this team is very busy with its sequel. Rajmouli already told 60% of second part is complited. Lets when will it finish.