మంత్రిని తొలగించిన బిజెపి

7 Jun 2016


మహారాష్ట్ర కేబినెట్ లో పెద్ద కుదుపు. గత వారం నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాధ్ ఖడ్సే పదవి ఊడింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంతో టచ్ లో ఉన్నారనే అంశమే ఎక్కువగా సంచలనం కలిగించగా, భూకేటాయింపుల్లో అక్రమాలు కూడా తోడవడం ఆయనకి పదవీగండం కలిగించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర లో మంత్రివర్గం నుంచి రెవెన్యూ శాఖామంత్రి ఏక్ నాధ్ ఖడ్సేకి ఉద్వాసన పలికారు. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ భూముల్లో తన బినామీలకు పెద్ద పాత్ర వేశారనే ఆరోపణలపై ఈ పరిణామం చోటు చేసుకుంది.

దీనికి ముందు ఏక్ నాధ్ ఖడ్సే కార్యాలయానికి దావూద్ ఇబ్రహీం కాల్స్ వస్తున్నాయనే ఆరోపణలు గత వారంనుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయ్. ఐతే ఈ అంశంపై విచారణ జరిపిన తర్వాతే ఏ నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్ చెప్పుకొచ్చారు. ఇలా వరసగా ఆరోపణలు వస్తుండటంతో పార్టీ ప్రతిష్ట దిగజారకుండా ఉండేందుకు మరోవైపు విపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనే తాజా నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో నంబర్ టూ ర్యాంక్ లో ఉన్న ఏక్ నాధ్ ఖడ్సే ఉద్వాసన ఖచ్చితంగా అక్కడి బిజెపిలో కుదుపుగానే భావిస్తున్నారు.

Maharastra BJP minister ekandh was removed form cabinet. He was abused that, he has affairs with Davud Ibrahim.