మోడీ పని చేయడు..చేయనివ్వడంటున్న కేజ్రీవాల్

14 Jun 2016


ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ పై భారతీయ జనతా పార్టీ మండిపడింది. రాష్ట్రపతి పదవి విశ్వసనీయతను ప్రశ్నించవద్దని హితవు పలికింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకపు బిల్లుకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరాకరించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రధానిని ప్రతిఅంశంలోకి లాగడం తగదని సూచించింది. ఆమ్ ఆద్మీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా ఎఁపిక చేయకపోవడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇది ప్రధానీ మోడీ పని తీరుకు నిదర్శనమంటూ ట్వీట్లు చేశారు.

నేను చేయను, మీరూ పని చేయొద్దనేలా వ్యవహరిస్తున్నారంటూ మోడీపై విరుచుకుపడ్డారాయన. తన పార్టీకి చెందిన వారిని ఒకరిని నీటి సమస్య, మరొకరు విద్యుత్ సమస్య ఇలా 21 మందిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించాలని  బిల్లు రాష్ట్రపతికి పంపించారు. ఐతే రాష్ట్రపతి దీన్ని తిరస్కరించడం పై వివాదం నెలకొంది సిఎం కేజ్రీవాల్ విమర్శలపై ఢిల్లీ బిజెపి కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది.  అసలు రాష్ట్రపతి, ఎలక్షన్ కమిషన్ పై వివాదం వద్దని వాటి విలువను దిగజార్చవద్దంటూ హితవు పలికింది. ఐతే కేజ్రీవాల్ మాత్రం ఆమ్ ఆద్మీ అంటేనే కేంద్రానికి పడటం లేదని, అందుకే ఇలా రాష్ట్రపతి ద్వారా తన బిల్లును ఆపుతున్నారని ఆరోపణలు కురిపిస్తున్నారు.

Delhi CM Aravind Kejriwal fired on Prime Minister Narendra Modi. Naredra Modi is not thinking about India development.