ఆ డిఎస్పీని బిజెపి లాగేస్తుందా..?

14 Jun 2016


కర్నాటక కూడ్లిగి మాజీ డిఎస్పీ అనుపమ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిధ్దమైంది. పోయిన వారం ఫేస్ బుక్ లో పోస్టులు కామెంట్లతో కాంగ్రెస్ సర్కారు కి షాక్ ఇచ్చిన అనుపమా షాణై, బిజెపినేతలతో టచ్ లోకి వెళ్లడంతో ఇక కాంగ్రెస్ మంత్రులను ఇంకాస్త ఇబ్బందులకు గురి చేసే అవకాశం కన్పిస్తోంది. పోయిన వారం కాంగ్రెస్ మంత్రి పరమేశ్వర్ నాయక్ తో పాటు, పోలీస్ ఉన్నతాధికారులకు ఇబ్బందులు తెచ్చిన మాజీ డిఎస్పీ అనుపమా షాణై నెక్ట్ తన స్టెప్ పాలిటిక్స్ వైపు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా ఆమోదం పొందగానే, బిజెపి లీడర్లతో టచ్ లోకి వెళ్లారామె.

అసలు అనుపణ షాణై ఫేస్ బుక్ లో కామెంట్లు పోస్ట్ చేసి అండర్ గ్రౌండ్లో ఉన్న సమయంలోనే కర్నాటక మాజీ ఎంపీ శోభా కరంద్లాజే, మరో ఎమ్మెల్సీ అనురాధతో ఫోన్ కాల్స్ తో సమాచార మార్పిడి చేసుకుందట. బిజెపి రాష్ట్ర నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే, రిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అనుపమ షాణై రిజైన్ చేసిన తర్వాత నిర్ణయం అక్కడి ముఖ్యమంత్రి చేతిలో ఉంది. ఐతే పొలిటికల్ ఎంట్రీ ఖరారు మాత్రం మాజీ సిఎం యడ్యూరప్ప చేతిలో ఉంది. ఆయన తీసుకునే నిర్ణయంపైనే డేట్ టైమ్ ఫిక్సవుతాయని టాక్..

Karnataka ex DSP Anupama is hot topic in Karnataka media with FB posts. She targeted polices superiors and congress party. Now she is ready to join in BJP.