మనోళ్లని అమెరికా ఎందుకు వద్దంటోంది

8 Jun 2016


అమెరికాలో మళ్లీ భారతీయ విద్యార్ధులను తిప్పి పంపేయడం ప్రారంభమైంది. ఏ సమాచారం లేకుండా అకస్మాత్తుగా వేరే అడ్మిషన్ వెతుక్కోవాలంటూ సూచించడంతో పాతికమంది ఇండియన్ స్టూడెంట్లకు షాక్ తగిలింది. వెస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీకి సంబంధించిన 25 మంది విద్యార్ధుల అడ్మిషన్లు రద్దు చేశారు. ఫస్ట్ సెమ్ లో ఉన్న వారికి ఇలా చెప్పా పెట్టకుండా అడ్మిషన్లు క్యాన్సిల్ చేయడం షాక్ ఇచ్చినట్లైంది. వెంటనే ఇండియా వెళ్లడం కానీ, మరో యూనివర్సిటీలో కానీ చేరమని చెప్పడంతో వారిప్పుడు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.

వీరి అడ్మిషన్లు క్యాన్సిల్ చేయడానికి కారణం స్టాండర్డ్స్ అందుకోలేకపోతున్నారని చెప్తున్నారు. దాదాపు ఆర్నెల్ల క్రితం 60 మంది కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ లో చేరగా, 25 మంది తమ టీచింగ్ తగ్గట్లుగా స్పందించలేకపోతున్నారని యూనివర్సిటీ చెప్తోంది. మిగిలిన 35 మందిని మాత్రం కొనసాగిస్తామంటోంది, ఐతే అడ్మిషన్ల టైమ్ లో ఎలాంటి రిమార్క్ లేకుండా, ఇప్పుడు సెమ్ పూర్తయ్యే సమయంలో ఇలా అడ్మిషన్లు రద్దు చేయడం విద్యార్ధుల్లో అయోమయం పెంచుతోంది. అసలు ఇంతకీ అమెరికాలో చదవాలంటే ఎలాంటి ఫార్మాట్ లో ముందుకెళ్లాలనేది తెలీక కన్ఫ్యూజ్ అవుతున్నారు.

America government cancelled 25 members of students admissions. They are telling our students are not reaching their standards.