సాక్షి ప్రసారాలను వెంటనే ప్రారంబించాలి

13 Jun 2016


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌బాబు ఒత్తిళ్లకు లొంగి నిలిపి వేసిన సాక్షి టీవీ చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని ఎంఎస్‌ఓలను వైఎస్సార్ కాంగ్రెస్ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఇది చట్టవిరుద్ధమని ఒక వేళ ఏ కారణం చేతనైనా ప్రసారాలు ఆపాలనుకుంటే కనీసం 21 రోజుల ముందస్తు నోటీసును ఇవ్వాలని ఆయన గుర్తు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరులతో ఆయన మాట్లాడారు.సాక్షి ప్రసారాలను ఆపివేయడం, నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని చూడనీయకుండా పోలీసులు అడ్డుకోవడం చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. లేక పాకిస్తాన్‌లో ఉన్నామా.. అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు.

ముద్రగడ దీక్ష వ్యవహారం తేలేంత వరకూ సాక్షి ప్రసారాలను ఆపి తీరుతామని మంత్రులు హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పడం.. చట్ట విరుద్ధమని తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎంఎస్‌ఓలు  తక్షణం సాక్షి ప్రసారాలను పునరుద్ధరించక పోతే తాము చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాక, ప్రతిచర్యలు ఉంటాయనేది గ్రహించాలని ఆయన హెచ్చరించారు.    అనుచితంగా వ్యవహరిస్తున్నారు..

 దీక్ష చేస్తూ రాజమండ్రి ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలియ జెప్పడానికి ఆయనను మీడియా ముందుకు తీసుకు వచ్చి మాట్లాడించాలని అంబటి డిమాండ్ చేశారు. ముద్రగడ భార్యను, కాళ్లు చచ్చుబడిన కుమారుడిని, మరో కుమారుడిని పోలీసులు చితక బాదారని, చివరకు ఆయన కోడలి పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

This is the best example how Chandrababu Naidu taking revenge on YS Jagan. AP Government banned Sakshi TV to telecast live coverage.