రెండో రోజా క్యాన్సల్ అయినా అమరావతి ట్రైన్

22 Jun 2016


విభజన నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల కోసం సికింద్రాబాద్ నుంచి బెజవాడ వరకు ప్రత్యేక రైలును సోమవారం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైన్ ను స్టార్ట్ చేసేందుకు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు విజయవాడకు వచ్చి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పచ్చ జెండా ఊపి స్టార్ట్ చేయించారు. హైదరాబాద్ లో ఉండే ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఉపయోగపడేలా ప్రారంభించిన ఈ రైలుకు ద్వితియ విఘ్నం తప్పలేదు.

సోమవారం సాయంత్రం బెజవాడ నుంచి స్టార్ట్ అయిన ఈ ట్రైన్ సికింద్రాబాద్ కు చేరుకున్నా.. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య పరుగులు తీయాల్సి ఉన్నా.. దీన్ని రైల్వే అధికారులు క్యాన్సిల్ చేశారు. ట్రైన్ ఎందుకు రద్దు అయ్యిందన్న విషయాన్ని చెప్పని అధికారులు.. త్వరలోనే ఈ ట్రైన్ ను  షెడ్యూల్ ప్రకారం రెగ్యులర్ గా నడుపుతామని వెల్లడించారు. శుభమా అని కొత్త ట్రైన్ స్టార్ట్ అయ్యాక.. ఈ ద్వితీయ విఘ్నం ఏమిటని పలువురు పెదవి విరుస్తున్నారు. ఆర్భాటంగా స్టార్ట్ చేసిన రైలుబండి రెండో రోజే ఆగిపోవటం ఏమిటో..?

Chandrababu Naidu nd Central Railway minister Suresh Prabhu inaugurated Amaravathi special train for AP secretariat employees. But Central railway cancelled this train second day.