అమ‌రావ‌తి నిర్మాణం లో చంద్ర‌బాబు కోడలి కంపెనీ..!

26 Jun 2016



అమ్మో..అమ్మో అనాల్సిన విష‌య‌మిది. ఏపీ రాజ‌కీయాల్లో క్విడ్ ప్రోకో వ్య‌వ‌హారాలు కొత్త పుంత‌లు తొక్కుతున్న ప‌రిణామ‌మిది. చంద్ర‌బాబు హ‌యంలో ప‌క్కా స్కెచ్ ప్ర‌కారం సాగుతున్న స్కామ్ ఇది. అందుకే అంద‌రూ నోరెళ్ల‌బెడుతున్నారు. ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అమ‌రావ‌తి మాటున సాగుతున్న వ్య‌వ‌హారంలో క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. స్విస్ ఛాలెంజ్ వెనుక అస‌లు క‌థ విని కంగారుప‌డుతున్నారు. మొత్తంగా ఏపీ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు సాగిస్తున్న కొత్త ప‌క్కా అవినీతి భండారం బ‌య‌ట‌ప‌డింది. కుటుంబ క‌థా చిత్రంగా క‌నిపిస్తున్న స్విస్ ఛాలెంజ్ అస‌లు విష‌యం అంద‌రినీ ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. ఇప్ప‌టికే రాజ‌కీయాలు క్రోనీ క్యాప‌టలిజం ద‌శ‌లో బినామీ కంపెనీల‌కు ప్ర‌భుత్వాలు ప్ర‌యోజ‌నం క‌ల్పించ‌డం..ఆ పేరుతో ప‌క్క‌దారిలో భారీగా ముడుపులు అందుకోవ‌డం అన్న‌ది చాలా సాధార‌ణంగా మారిపోతోంది. ఇప్పుడు ఇక చంద్ర‌బాబు ప‌థ‌కం చూస్తే అది మ‌రింత బాహాటంగా సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఏపీ రాజ‌ధాని నిర్మాణం ఇప్పుడు హాట్ టాపిక్. తాత్కాలిక రాజ‌ధాని కోస‌మే 200 కోట్లు కేటాయించి..ఆత‌ర్వాత ఇసుక ఉచితంగా అందించి మ‌రీ ప్ర‌భుత్వం కొన్ని సంస్థ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడుతుంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం.ఇక ఇప్పుడు శాశ్వ‌త రాజ‌ధాని నిర్మాణం కూడా స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తికి ప్ర‌భుత్వం ఒకే చెప్పేసింది. అంటే తాను అనుకున్న కంపెనీకి రాజ‌ధాని నిర్మాణం క‌ట్ట‌బెట్ట‌డానికి చంద్ర‌బాబు క్యాబినెట్ ఓకే అనేసింది. ఇక ఆ కంపెనీకి రాజ‌ధాని నిర్మాణం పేరిట ప్ర‌జ‌ల భూములు, ప్ర‌భుత్వ ఆస్తులు అప్ప‌గించ‌డ‌మే త‌రువాయి. అయితే ఈ వ్య‌వ‌హారంలో త‌మ‌కు చాలా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ స‌హా అధికార యంత్రాంగం అంతా భావించింది. అందుకే బాబు క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకోవాలి త‌ప్ప‌..తాము మాత్రం సంత‌కాలు చేసేది లేద‌ని తేల్చి చెప్పేసింది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు వెన‌కుడుగు వేయ‌లేదు. నేరుగా రాజ‌ధాని నిర్మాణం వ్య‌వ‌హారం స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో సింగ‌పూర్ కంపెనీల‌కు అప్ప‌గించ‌డం ఖాయం అయ్యింది. అయితే సెంబ్ కార్ప్, అసెండాస్-సింగ్ బ్రిడ్జ్ అనే కంపెనీల‌కు ఆ వ్య‌వ‌హారం క‌ట్ట‌బెట్ట‌డం వెనుక చాలా పెద్ద క‌థే న‌డిచిన‌ట్టు ప‌లువురు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ రెండు కంపెనీలు టెమాసెక్ హోల్డింగ్స్ అనే మ‌రో కంపెనీ చేతుల్లో ఉన్నాయి. అంతేకాదు వెర్టెక్స్ వెంచ‌ర్స్ అనే మ‌రో కంపెనీ కూడా భాగ‌స్వామిగా ఉంది. ఆకంపెనీలో గ‌తంలో చంద్ర‌బాబు కోడ‌లు, నారాలోకేష్ భార్య బ్రాహ్మ‌ణి ప‌నిచేసిన‌ట్టు ఆ కంపెనీ అధికారికంగా చెబుతోంది. అంతేగాకుండా కొద్ది కాలం క్రిత‌మే ఈ టెమాసెక్ హోల్డింగ్స్ హైద‌రాబాద్ లో వ్యాపారాలు ప్రారంభించింది. కేర్ హాస్పిట‌ల్ ను కొనుగోలు చేసింది. మ‌రో అస‌లు విష‌యం ఏమంటే ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధతిలో రాజ‌ధాని నిర్మాణం అప్ప‌గించ‌బోతున్న సంస్థ‌లో ఈ టెమాసెక్ హోల్డింగ్స్ గ‌త ఏడాది జూన్ లో భాగ‌స్వామి కావ‌డం విశేషం.

మొత్తంగా ప‌క్కా స్కెచ్ ప్ర‌కారం చంద్ర‌బాబు స‌న్నిహితుల‌కు, కుటుంబ స‌భ్య‌ల‌కు సంబంధించిన కంపెనీల‌కు రాజ‌ధాని నిర్మాణం క‌ట్ట‌బెడుతున్నారు. త‌ద్వారా రాజ‌ధాని పేరిట సాగ‌బోతున్న వ్య‌వ‌హారమంతా బాబు గారి క‌నుస‌న్న‌ల్లో ఇలాంటి క్విడ్ ప్రోకో వెనుక ఉన్న బినామీ కంపెనీల లాభాల కోసం సాగుతున్న చందాన క‌నిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం పెద్ద క‌ల‌క‌లం రేపుతోంది. చంద్ర‌బాబు కుటుంబంతో సంబంధాలున్న వారికే ఇంత పెద్ద వ్య‌వ‌హారంలో బాగ‌స్వామ్యం ద‌క్క‌డం వెనుక పెద్ద క‌థే న‌డిచిన‌ట్టు అనుమానాలు పెరుగుతున్నాయి. అమ‌రావ‌తి న‌గ‌రం మాటున పెద్ద అవినీతి వ్య‌వ‌హారం సాగుతున్న‌ట్టు ఎక్కువ మంది భావించ‌డానికి ఆదారంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాజ‌ధానిలో మంత్రులు, వారి బంధువుల భూమ‌లు బండారం బ‌య‌ట‌ప‌డింది, టీడీపీ ఎంపీలు, ఇత‌ర స‌న్నిహితులు కొనుగోలు చేసిన భూములు, అసైన్డ్ ల్యాండ్స్ పేరిట సాగిన వ్య‌వ‌హారం పెద్ద దుమారం రేపింది. ఇక ఇప్పుడు నేరుగా రాజ‌ధాని నిర్మాణం కాంట్రాక్ట్ ఏకంగా సీఎం కోడ‌లికి సంబంధించిన కంపెనీకే ద‌క్క‌డం జ‌నాన్ని నోరెళ్ల‌బెట్టేలా చేస్తోంది. నిప్పులాంటి వాడిన‌ని చెప్పుకునే బాబు పాల‌న‌లో సాగుతున్న ఈ తంతు అతి పెద్ద కుంభ‌కోణ‌మేన‌న్న వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి.

This is the best example how Chandrababu Naidu earning money by misusing his power. Nara Bhrahmani company is the part of Amaravathi Construction.