చంద్రబాబు అభివృధికి ప్రతిక..

4 Jun 2016


కొన్ని నిర్లక్ష్యాల నష్టం అపారంగా ఉంటుంది. ఒకసారి నమ్మకం పోయాక.. దాన్ని తిరిగి తెచ్చేందుకు చాలా కష్టపడాలి. అయినా అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని విషయాల్లో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న అంశాల విషయంలో ఎలాంటి తప్పులు అయితే దొర్లకూడదో అలాంటి తప్పులు చేస్తున్నారు. దసరా రోజున ఏపీ రాజధాని అమరావతి భూమిపూజ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం కోసం సుమారు రూ.250 కోట్లకు పైనే ఖర్చు చేశారు కూడా.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని నభూతోనభవిష్యతి అన్నట్లుగా నిర్వహించటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా పూర్తి చేయకుండా.. అమరావతి నిర్మాణం ఎంత గ్రాండ్ గా ఉంటుందన్న విషయం అర్థమయ్యేలా నిర్వహించారని చెప్పాలి. ఇక.. శంకుస్థాపన కోసం ఏపీలోని గ్రామ.. గ్రామాల్లో నుంచి మట్టి.. నీరు తెప్పించి.. అంతా కలిపి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేయటం ద్వారా.. అమరావతి నిర్మాణం ఏపీ ప్రజలందరి భాగస్వామ్యంతో సాగుతుందన్న భావన కలిగేలా చంద్రబాబు చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే శంకుస్థాపన కార్యక్రమం పూర్తిస్థాయి భావోద్వేగ కార్యక్రమంగా సాగిందని చెప్పొచ్చు.

మరి.. ఇంత ఘనంగా నిర్వహించిన తర్వాత.. శంకుస్థాపన ప్రాంతం.. యాగశాల.. అక్కడ ఏర్పాటు చేసిన దేవతామూర్తులు.. అఖండ జ్యోతి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అఖండ జ్యోతి ఆరిపోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తు ఈ జ్యోతి ఎప్పుడో ఆరిపోయింది. అయితే.. కోటప్ప కొండకు తరలించటం ద్వారా అఖండజ్యోతి ఆరిపోలేదని చెప్పినా.. దీన్ని ఏర్పాటు చేసిన చోట ఒక శాశ్విత కట్టటం కట్టి ఉంటే బాగుండేది. కానీ.. అలాంటివేమీ జరగలేదు. తాజాగా భారీగా వీచిన గాలులకు అఖండ జ్యోతి స్టాండ్ కొట్టుకు పోవటంతో పాటు.. యాగశాల కూలిపోవటం గమనార్హం.

ఇక.. ఏపీ గ్రామాల నుంచి తెప్పించిన యాగమట్టి కూడా తడిచిపోతున్న పరిస్థితి. భావోద్వేగాల నడుమ జరిగిన శంకుస్థాపనను వైభవంగా నిర్వహించిన చంద్రబాబు.. అందుకు తగ్గట్లుగా.. ఆ బావనను కలకాలం నిలిచేలా చేయాలే తప్పించి.. చిన్న చిన్న గాలులకే వాటి స్వరూపం మారిపోయేలా ఉండటం సీమాంధ్రుల సెంటిమెంట్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని బాబు గుర్తిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Chandrababu Naidu always saying, i will develop Amaravathi in International standard. But if we see it we can decide how it is now.