ఇదో దిక్కుమాలిన చర్య

3 Jun 2016


రెండేళ్ల నుంచి సెక్రటరియట్ ఉద్యోగులు అమరావతికి వెళ్లాలనేది అందరూ అనుకునేదే, అది వదిలేసి ఇవాళ ఎంప్లాయీలను ఉన్నపళంగా పొమ్మంటున్నారనేది వారి విమర్శ, ఆరోపణ. నిజంగా ఈ విషయంలో ఏ బాబు అధికారంలో ఉన్నా, తప్పు ప్రభుత్వానిది కాదు. ఎందుకంటే రేపు వచ్చే ఏడాదికి వాయిదా వేసినా, వీళ్లంతా ఇదే పోకడలు పోతారు. అటు చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంతమాత్రాన ప్రతీదానికి ఆయన్ని  ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. ముందు అమరావతికి వెళ్తే, సమస్యలు చక్కబడతాయ్ కానీ, ఇలా పార్టీలనేతల చుట్టూ తిరగడం ఎంత వరకూ కరెక్ట్. పిల్లల చదువులు, చదువులు అంటున్నారు. నిజంగా వీళ్లంతా రీలొకేట్ అయ్యేవాళ్లేనా. అప్పట్లో రాష్ట్రంకోసం ఏ త్యాగమైనా చేస్తామనేవాళ్లు, చిన్న చిన్న విషయాలకు ఎందుకు రగడ చేసేదీ తెలీదు. వీళ్ల ఉద్దేశంలో అన్నీ ప్రభుత్వమే ఫ్రీగా చేసి పెట్టాలేమో, అడిగినంత డీఏ ఇవ్వడం అడిగినన్ని లీవులు ఇవ్వడమే కాకుండా..ఇంకా ఏం కావాలో మరి..!

చేస్తే అధికారపక్షనేత చేయాలి, లేదంటే ప్రతిపక్షనేత పోరాడాలి అది వదిలేసి. అటు ఇటు కాకుండా, బిజెపి వలస నేత పురంధీశ్వరికి మహిళా ఉద్యోగులు కలవడం ఏంటో మరి. దీనివెనుక రాజకీయంగా ఆమెని ఫోకస్ చేయాలనే కోణం ఉందేమో అనే అనుమానం కలుగుతోంది. తాత్కాలిక సచివాలయం కాదు శాశ్వత సచివాలయం ఐతేనే వెళ్తామనడం నిజంగా తలతిక్కతనమే, కట్టే బిల్డింగ్ శాశ్వతంగా ఉంటుంది. నిజానికి అక్కడ ఏ ఆఫీస్ ఎక్కడుంటుందో ఎవరు ఇప్పుడే ఎలా డిసైడ్ చేయగలరు. కాలక్రమంలో వచ్చే ఇబ్బందులు ప్రాక్టికల్ గా దిగితే కానీ తెలీదు కదా. అందుకే ఉద్యోగుల తీరుపై జనంలో కూడా మండిపాటే కన్పిస్తుంది కానీ, మద్దతు తక్కువే వస్తోంది.

Ap Secretariat employees opposing to go to Amaravathi. Since last two years AP government telling, they have to go to Vijayawada. But till now they are telling we cant move immediately.