నేడు పోలీస్‌ స్టేషన్లలో సిఎంపై ఫిర్యాదులు

8 Jun 2016


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా గడప..గడపకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌ పాండ్‌లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను మీడియాకు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, కరువు, తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఇందులో భాగంగానే బుధవారం ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 13న విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. 

రెండేళ్లలో చంద్రబాబు సాధించిందేమీ లేదు 
రెండేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేసిందేమీలేదని పార్థసారథి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పట్టిసీమ పూర్తి చేసి గోదావరి కష్ణా జలాల అనుసంధానం జరిగిందని చెప్పిన చంద్రబాబు ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్‌ విసిరారు. 

ఆత్మ పరిశీలన చేసుకోవాలి : ధర్మాన 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనపై ఇప్పటికైనా ఆత్మప రిశీలన చేసుకోవాలని వైసిపి సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు సూచించారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసేందేమీ లేదని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని ఆరోపించారు.

On YS Rajashekar Reddy birthday, in Lotus pond YSRCP decided to file cased against Chandrababu Naidu. It was two years passed away, two years of government formed, but no development in AP.