చంద్రబాబు పై 420

7 Jun 2016


ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగుతున్న పోరులో కొత్త ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టి  ఈనెల 8తో రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో బాబు పాలనపై వైసీపీ పోరుబాటకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన దాదాపు ఆరువందల హమీల్లో టీడీపీ సర్కారు ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయలేదని మండిపడుతోన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలు రచిస్తోంది. చంద్రబాబు రెండేళ్ల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా.. అన్ని మండలాల పోలీసు స్టేషన్ లలో 420 కేసులు నమోదు చేయించాలని నిర్ణయించింది.

ఓట్ల కోసం హామీలు గుప్పించిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక అన్నింటినీ గాలికి వదిలేశారని వైసీపీ మండిపడుతోంది. ఏదడిగినా రాష్ట్ర లోటు బడ్జెట్ను సాకుగా చూపుతున్నారంటూ. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా - రైతు - డ్వాక్రా రుణమాఫీ - ఉద్యోగ అవకాశాలు - నిరుద్యోగ భృతి - పెన్షన్ల వంటి ప్రధాన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న చంద్రబాబు... ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదని... ఈ అంశాలన్నింటిపైనా ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది.

రెండేళ్ల సంబరాల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబును కొత్తగా ఇరుకున పెట్టాలని చూస్తున్న  వైసీపీ ప్రయత్నం ఎంతమేరకు సఫలం అవుతాయో చూడాలి మరి. ఈ ఎపిసోడ్ పై టీడీపీ నేతలు ఏ విధంగా రియాక్టవుతారో మరి.

To this month June 8 two years passed away that Chandrababu Naidu formed government. So YSRCP Leader YS Jagan targeting Chandrababu Naidu and filed 420 cased against AP CM.