టీడీపీకి షాక్… వైసీపీలో చేరిన 100 కుటుంబాలు…

22 Jun 2016


ఆంధ్రప్రదేశ్ లో వలస రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నాయి. నిన్నటివరకు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతుంటే.. ప్రజలు మాత్రం వైసీపీలో చేరుతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గంలో ఉన్న 100కు పైగా కుటుంబాలు.. ఇవాళ వైసీపీలో చేరాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షలో వీరంతా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సంగరయ్య కూడా వైసీపీలో చేరారు. ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేని టీడీపీ పాలనలో వీరంతా అభివృద్ధికి దూరంగా ఉన్నారని.. ఎన్ని పథకాలున్నా వీరికి మాత్రం అవి చేరలేదని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. తామంతా ఇకపై అవినాష్, జగన్ కు అండగా ఉంటామని ఆ కుటుంబాలు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయిస్తున్నా.. ప్రజలు మాత్రం తమ వెంటే ఉన్నారని అవినాష్ రెడ్డి అన్నారు.

ఎదీ ఎమైనా సరే ప్రజలనే నమ్ముకోమని పార్టీ ని నడుపుతున్నా జగన్ కి ఇలా ఒక్క సారే 100 కుటుంబాలు వైకాపా లో చేరడం నిజంగా హర్షించ దగ్గ విషయమే. ఎందుకంటే వైకాపా నుంచి ఎమ్మెల్యె లను ఇష్టం వచ్చినట్లు గా కోంటున్నా టీడిపి కి ఇది గట్టి ఎదురదెబ్బ. దాంతో ఇక ఇప్పటి నుంచి పార్టీ మారాలి అనుకునే వారికి ఇది ఒక ఆలోచన గా ఉంటుంది.

It is really big shock to Chandrababu Naidu. Since last few months he is buying MLAs form YSRCP with special offers. But now 100 families are joined in YSRCP.