పోకిరి+బిజినెస్ మేన్=జనగణమన

2 May 2016


మహేష్ ఈ  పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయంటారు, పూరీ జగన్నాధ్ ఫక్తు జులాయి వెధవలా హీరోని చూపిస్తూనే హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆయన సినిమాల్లో హీరోలు, వాటిలో పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది పోకిరి, ఆ తర్వాత వచ్చిన బిజినెస్ మేన్ 75 రోజుల్లోనే పూర్తై కేక పుట్టించింది. అసలు ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్స్ కి భారీ హిట్టేదైనా ఉందంటే అది బిజినెస్ మేనే. మహేష్ బాబు లోని ఫెరోషియస్ ఏంగిల్ ని సెటిల్డ్ లుక్ ని ఫుల్ ప్లెడ్జ్ డ్ గా బయటకు తెచ్చిన సినిమా అది.

ఇప్పుడు వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోందట. టైటిల్ కూడా బైటికి లీక్ చేశారు. అదే జనగణమన.. పోకిరి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో ట్విట్టర్లో దీనికి సంబంధించిన లీక్ ఇచ్చేశారు పూరీ. పోకిరి, బిజినెస్ మేన్ ని మించేలా వస్తుందని హామీ కూడా ఇచ్చేశాడు. దానికి రిటన్ గా ప్రిన్స్ కూడా కెరీర్ బెస్ట్ మూవీగా మిగలాలని ఒపీనియన్ పెట్టాడు. ఐతే ప్రస్తుతానికి వీళ్లిద్దరూ బిజి బిజీ, మహేష్ బ్రహ్మోత్సవం ఆ తర్వాత, మురుగుదాస్ మూవీ మరోవైపు పూరీ నందమూరి బ్రదర్శ్ తో మూవీలతో బిజీ, బహుశా ముహూర్తాల నేపధ్యంలోనే ఇలా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారని టాక్ ఏదైతేనే ఇది మాత్రం మహేష్ ప్యాన్స్ కి పండగలాంటి కబురే.

Tollywood director Puri Jaganath is care of address for punch dialogues. And Mahesh Babu is number one star in Tollywood. Now they both combination is going to rock. Puri Jaganath twitted it for ocation of Pokiri movie complited 10 years.