బాలయ్యా జర జాగ్రత్త

28 May 2016


బాలకృష్ణ వందో సినిమాకి భారీగా ఖర్చు  పెడుతున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయ్. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు మేకింగ్ పరంగా రికార్డు క్రియేట్ చేశాయ్ కానీ, కలెక్షన్లు మాత్రం తుస్సుమన్నాయ్. ఇంత హైప్ ఉన్న సినిమాలు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడంతో రెవెన్యూ రాబడిపై లెక్కలు వేయాల్సిన సిచ్యుయేషన్ ఎదురవుతోంది. వందో సినిమా అని హడావుడి చేయనని, అది ఫ్యాన్స్ కి మాత్రమే అని చెప్పిన బాలకృష్ణ సినిమా వచ్చేసరికి అది అమలు చేయడంలేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక్క ఫస్ట్ షెడ్యూల్ కే 8 కోట్లు ఖర్చు పెట్టడం సంచలనం కలిగిస్తోంది. మొరాకోలో వేసిన సెట్స్ భారీ ప్రొడక్షన్ తో ఇలా ఖర్చైందంటున్నారు, అసలు ఈ ఖర్చుతోనే రెండు చిన్న సినిమాలు తీయవచ్చు. హిందీలో హిట్టైన భాగి సినిమా మొత్తం కాస్టే ఇది, ఆ సినిమా ఇప్పుడు 70కోట్లు కలెక్ట్ చేసింది. ఆ సంగతులు పక్కనబెడితే, గౌతమీపుత్ర శాతకర్ణిని హిందీలో కూడా రిలీజ్ చేయడంతో కలెక్షన్ల పరంగా సేఫ్ గా ఉండొచ్చని ప్లానేస్తున్నారు.

ఐతే బాలయ్య సినిమాలు హిందీలో ఆడలేదు, బాహుబలి ఓ జానపద సినిమాలా అన్పించి చూశారు. కానీ గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చి ఓ ప్రాంతానికి చెందిన రాజు చరిత్ర, ఇది కాస్తో కూస్తే నేటివిటీ ఫీలింగ్ కలిగిస్తుంది. కేవలం గ్రాఫికల్ వర్క్ అద్భుతంగా ఉన్నంతమాత్రాన నార్తిండియన్లు కనెక్ట్ అవ్వడం కష్టమే, అందుకే బడ్జెట్ విషయంలో బాలయ్య కాస్త దృష్టి పెట్టాలని శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు. లేదంటే 60కోట్ల బడ్జెట్ కి తగ్గట్లు బిజినెస్ జరగడం ఒకెత్తు కావడంతో పాటు, రిలీజ్ అయిన తర్వాత బయ్యర్లు నష్టపోకుండా ఉండటం మరొకెత్తు.

Total Balakrishna fans are waiting for his hundred movie Gouthamiputra Sathakarni. For this movie he spending more money, only for first schedule he spent 8 crores. Recently high budget movies Sardaar Gabbarsing, Bhrmotsavam are failed at box office.