టీడీపికి షాక్ ఇచ్చిన మహేష్ బాబు

16 May 2016


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమాలు పూర్తిగా వదిలేసి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంటర్ అవబోతున్నారు. దీంతో టీడిపి తమ్ముళ్లు కొంత కలవరపాటుకి గురవుతున్నారు. పవన్ గెలుస్తాడా, గెలవడా అనేది పక్కన పెడితే, యూత్ లో ఫాలోయింగ్ ఉన్న పవన్, ఓట్లలో చీలిక మాత్రం తేగలడు. దానికితోడు, ఒక సమాజిక వర్గం పవన్ కి సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో, మొన్న మహేష్ బాబు బుర్రిపాలెంలో చేసిన రోడ్ షోకి అద్భుతమైన స్పందన రావడంతో మహేష్ ని పవన్ కి పోటిగా ప్రచారం చేయించడమే కరెక్టు అని జయదేవ్ గల్లాతో గుంటూరు ప్రాంతస్థాయి తెలుగుదేశం నాయకులు అన్నారట. మహేష్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని జయదేవ్ గల్లా చెప్పినా ఏదో మూల చిన్న ఆశ ఉండింది తెదేపా తమ్ముళ్ళకు.

మొన్న జరిగిన రోడ్ షోను దృష్టిలో పెట్టుకోనే, బ్రహ్మోత్సవం ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మహేష్ బాబుని రాజకీయాల గురించి అడిగింది ఒక టీవి ఛానెల్. అయితే మహేష్ సూటిగా "నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను ఏ పార్టీకి కూడా ప్రచారం చేయను " అంటూ తేల్చి పడేసాడు. దీంతో మహేష్ ని రాజకీయంగా ఉపయోగించుకుందామనుకున్న టీడిపికి పెద్ద షాక్ తగిలింది. 

Pavan Kalyan almost came out from TDP and NDA. Now TDP showing interest on Mahesh Babu. But recent in Bhramotsavam movie promotion he declared, i have no interest on Politics.